జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన వారాహి యాత్ర ప్రస్తుతం నాలుగో దశ కొనసాగుతోంది. నేడు కైకలూరు నియోజకవర్గం ముదినేపల్లిలో వారాహి యాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. 2014లో బీజేపీ, టీడీపీ అధికారంలోకి రాకుండా ఉంటే.. జనసేన పరిస్థితి ఏంటో అర్థం చేసుకోండని ఆయన అన్నారు. అంతేకాకుండా.. వైఎస్సార్‌ను ఎదురించి కూడా నేను ఎక్కడికి పారిపోలేదని, మేము గెలిచిన రోజున.. దమ్ముంటే మీ ఇళ్లల్లో, మీ ఆఫీసుల్లో ఉండండని ఆయన అన్నారు. ఎవరెవరిపై ఏ కేసులు పెట్టారో అన్నీ గుర్తు ఉన్నాయన్న పవన్… వైసీపీ నేతలకు ఎందుకంత భయమన్నారు. ఢిల్లీ వెళ్లారు కదా.. తెలంగాణతో పాటు ఎన్నికలంటే మరో నెలన్నర రోజులే అని ఆయన అన్నారు.
ఇదిలా ఉంటే.. పవన్ నిన్న వారాహి జగన్‌ది రూపాయి పావలా ప్రభుత్వం అంటూ విమర్శలు గుప్పించారు. కృష్ణా జిల్లా పెడనలో నిన్న నిర్వహించిన వారాహి యాత్రలో భాగంగా నిర్వహించిన బహిరంగ సభలో పవన్ మాట్లాడారు. వచ్చే ఎన్నికల తర్వాత జనసేన – టీడీపీ ప్రభుత్వం రాబోతుందని.. రాష్ట్ర ప్రయోజనాల వద్దకు వచ్చేసరికి మనమంతా ఒక్కటి కావాలని పవన్ పిలుపునిచ్చారు. మనలో విభేదాలు పాలసీల వరకే పరిమితం చేసుకోవాలని టీడీపీ, జనసేన శ్రేణులకు సూచించారు. ఓట్లు వేయించుకునేందుకే వైసీపీ పథకాలను ప్రవేశపెడుతుందని.. వాటి అమలు వరకు వచ్చేసరికి వైసీపీ పథకాల్లో అంతా డొల్లతనం కనిపిస్తుందని పవన్ ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వం.. ఉపాధి కూలీల పొట్ట కొట్టిందని పవన్ ఆరోపించారు. సగానికి సగం ఉపాధిహామీ నిధులు దారి మళ్లించారనీ.. నిధుల మళ్లింపులో రాష్ట్రానిదే అగ్రస్థానమని కేంద్రం చెప్పింది పవన్ పేర్కొన్నారు.