పోలీసు అభ్యర్థులకు బిగ్ అలర్ట్. తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ 8 నుంచి పోలీస్ అభ్యర్థులకు ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించనున్నట్లు పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటించింది. ఇప్పటికి క్వాలిఫై అయినా అభ్యర్థులకు ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించనున్నారు.
తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా 11 కేంద్రాల్లో దేహదారుడిగా పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలోనే రేపటి నుంచి అడ్మిషన్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ తాజాగా ప్రకటించింది.