ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ సేవింగ్ డేస్ సేల్‌.. ఐఫోన్లు, శాంసంగ్ ఫోన్ల‌పై ఆఫ‌ర్లు…

-

ఈ-కామ‌ర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ డిసెంబర్ 18 నుంచి బిగ్ సేవింగ్ డేస్ సేల్‌ను నిర్వ‌హించ‌నుంది. డిసెంబ‌ర్ 22వ తేదీ వ‌ర‌కు ఈ సేల్ కొన‌సాగ‌నుంది. ఇందులో భాగంగా అనేక కంపెనీల‌కు చెందిన స్మార్ట్ ఫోన్ల‌పై ఆక‌ట్టుకునే ఆఫ‌ర్స్, డీల్స్, డిస్కౌంట్ల‌ను అందివ్వ‌నున్నారు. ముఖ్యంగా సేల్‌లో యాపిల్‌, శాంసంగ్‌, షియోమీ కంపెనీల‌కు చెందిన ఫోన్ల‌ను భారీ త‌గ్గింపు ధ‌ర‌ల‌కు కొనుగోలు చేయ‌వ‌చ్చు.

సేల్‌లో భాగంగా ఎస్‌బీఐ కార్డుల‌తో ప్రొడ‌క్ట్స్‌పై అద‌నంగా 10 శాతం డిస్కౌంట్‌ను పొంద‌వ‌చ్చు. ఇక ఫ్లిప్‌కార్ట్ ప్ల‌స్ మెంబ‌ర్ల‌కు సేల్ డిసెంబర్ 17న మ‌ధ్యాహ్నం 12 గంట‌ల నుంచే అందుబాటులోకి వ‌స్తుంది. సేల్‌లో రియ‌ల్‌మి 6కు చెందిన 8జీబీ ర్యామ్ వేరియెంట్‌ను రూ.12,999 ధ‌ర‌కే కొన‌వ‌చ్చు. అలాగే 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్‌ను రూ.16,999 ధ‌ర‌కు కొనుగోలు చేయ‌వ‌చ్చు. రియ‌ల్‌మి నార్జో 20 ప్రొ ఫోన్‌ను రూ.13,999 ధ‌ర‌కు, రియ‌ల్‌మి 6ఐ ఫోన్‌ను రూ.11,999 ధ‌ర‌కు కొనుగోలు చేయ‌వ‌చ్చు.

శాంసంగ్ గెలాక్సీ ఎఫ్‌41కు చెందిన 6జీబీ, 128జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.15,499 ధ‌ర‌కు ల‌భిస్తుంది. ఐఫోన్ ఎక్స్ఆర్ ఫోన్‌ను రూ.38,999 ప్రారంభ ధ‌ర‌కు కొన‌వ‌చ్చు. దీనిపై నెల‌కు రూ.6500 వ‌రకు నో కాస్ట్ ఈఎంఐ స‌దుపాయం ల‌భిస్తుంది. ఒప్పో రెనో 2ఎఫ్‌కు చెందిన 6జీబీ, 256 జీబీ స్టోరేజ్ వేరియెంట్‌ను రూ.15,990కు, ఒప్పో ఎఫ్‌15కు చెందిన 4జీబీ, 128 జీబీ మోడ‌ల్‌ను రూ.14,990కి, ఐఫోన్ ఎస్ఈ 2020ని రూ.35,900 ప్రారంభ ధ‌ర‌కు కొన‌వ‌చ్చు. ఎల్‌జీ జీ8ఎక్స్ థిన్‌క్యూ ఫోన్ కు చెందిన 6జీబీ ర్యామ్, 128 జీబీ మోడ‌ల్ రూ.27,990 ధ‌ర‌కు ల‌భిస్తుంది. ఇవే కాకుండా మ‌రిన్ని ఫోన్ల‌ను ఈ సేల్‌లో త‌గ్గింపు ధ‌ర‌లకు పొంద‌వ‌చ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version