2025లో మీలో మార్పు రావాలనుకుంటే మీరు ఫోకస్ చేయాల్సిన విషయాలు

-

మార్పు.. కొత్త సంవత్సరం వస్తుందని మార్పు గురించి ప్రతి ఒక్కరూ ఆలోచిస్తారు. ప్రస్తుతం ఇంకొన్ని రోజుల్లో 2024 పూర్తవుతుంది. 2025లోకి వెళ్లేముందు ఎలాంటి విషయాల్లో, ఏ విధంగా మారితే లైఫ్ బాగుంటుందో ఇక్కడ తెలుసుకుందాం.

అవసరం లేని యాప్స్ డిలీట్ చేయండి:

మనకు అవసరం ఉన్నా లేకపోయినా చాలాసార్లు అనేక యాప్స్ డౌన్లోడ్ చేస్తుంటాం. చాలాసార్లు వీటిని పట్టించుకోము. అయితే మీకు తెలియకుండానే ఇలాంటి యాప్స్ వల్ల మీ ఫోకస్ దెబ్బతింటుంది. అందుకే వారంలో ఒకరోజు తీరిగ్గా కూర్చుని.. మీరు వాడని అవసరం లేని యాప్స్ డిలీట్ చేయండి.

చిన్న చిన్న మార్పులు చేయండి:

జీవితంలో మార్పులు అంత ఈజీగా రావు. వాటిని నెమ్మదిగా జీవితంలోకి అలవాటు చేయాలి. సపోజ్ మీకు వ్యాయామం చేసే అలవాటు లేదు అనుకుందాం. కొత్త సంవత్సరంలో దాన్ని అలవాటు చేసుకోవాలి. అలాంటప్పుడు ఒక వారం రోజులు పది నిమిషాలు మాత్రమే వ్యాయామం చేయాలి. తర్వాత వారం దాన్ని 20 నిమిషాలకు పెంచాలి. ఇలా నెమ్మది నెమ్మదిగా మీ బాడీకి అలవాటు చేయాలి.

గమ్యం వైపు వెళ్తున్నారా చూసుకోండి:

చాలాసార్లు గమ్యాలను మర్చిపోతుంటాం. మీరు అలా మర్చిపోవద్దు. రోజూ పొద్దున్న లేవగానే అసలు మీరు జీవితంలో ఏం సాధించాలనుకుంటున్నారో రెండు నిమిషాలు ఆలోచించండి. మీరు చేస్తున్న ప్రయాణం అటువైపుగా ఉందా అనేది చూసుకోండి.

కొత్త అలవాట్లు:

మంచి అలవాట్లు చేసుకోండి. ముఖ్యంగా చదవడం, రాయడం చేయండి. దీన్ని ఏ విధంగా అలవర్చుకోవాలంటే, ప్రతిరోజు ఎంతో కొంత చదవాలని గట్టి నిర్ణయం తీసుకోండి. మీరు చదివిన రోజు క్యాలెండర్లో టిక్ చేసుకోండి. ఈ విధంగా మీకు కొత్త అలవాటు అలవడుతుంది.

బంధాలను దూరం చేసుకోవద్దు:

పనిలో పడి బంధాలను మర్చిపోతుంటారు. కొత్త సంవత్సరంలో మీరు అలా మర్చిపోకూడదు. 15 రోజులకు ఒకసారైనా.. మీ దగ్గర బంధువులతో మాట్లాడండి. మరీ ఎక్కువ కాదు.. కనీసం ఐదు నిమిషాలయినా టైం తీసుకుని మాట కలపండి.

Read more RELATED
Recommended to you

Latest news