ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కు షాక్ తగిలింది. దాణా కుంభకోణంలో దోషిగా తేలుస్తూ… జార్ఖండ్ సీబీఐ స్పెషల్ కోర్ట్ సంచలన తీర్పు ఇచ్చింది. దాదాపు 25 ఏళ్ల తరువాత లాలూ ప్రసాద్ యాదవ్ ను కోర్టు దోషిగా నిర్థారించింది.
ఆర్జేడీ ఛీఫ్, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఐదవ దాణా కుంభకోణం కేసులో దోషిగా తేలింది. డోరాండా ట్రెజరీ నుండి రూ. 139.35 కోట్ల అక్రమ విత్‌డ్రాలకు అతను దోషిగా నిర్ధారించబడ్డాడు. మొత్తం 5 దాణా కేసుల్లో లాలూ నిందితుడిగా తేలింది. దాణా స్కాంలో మొత్తం రూ. 950 కోట్ల స్కాం జరిగింది. దీంట్లో ప్రధాన నిందితుడిగా లాలూ ప్రసాద్ యాదవ్ ఉన్నారు. గతంలో ఈ కేసులో లాలూ కొన్ని రోజులు జైలు శిక్ష అనుభవించాడు. మొత్తం ఈ కేసుల్లో 99 మంది దోషులగా ఉంటే వీరిలో 24 మంది నిర్దోషులుగా విడుదలయ్యారు. గతంలో నాలుగు కేసులను లాలూ ప్రసాద్ యాదవ్ సవాల్ చేశారు. ప్రస్తుతం ఈ కేసులో కూడా పైకోర్ట్ లో సవాల్ చేసే అవకాశం ఉంది.