ఆచార్య చాణక్య చెప్పినట్లు మనం ఆచరిస్తే లైఫ్ లో వచ్చే ఎలాంటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది. అనేక రకాల సమస్యల గురించి చాణక్య నీతి లో చక్కగా వివరించారు. చాణక్య చెప్పిన సూత్రాలు ఇప్పటికి కూడా ఎంతోమంది ఆచరిస్తున్నారు. ఎలాంటి క్లిష్టమైన పరిస్థితి నుండి అయినా సరే చాణక్య సూత్రాలు ద్వారా మనం గట్టెక్కొచ్చు. కుటుంబ సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, మన గమ్యస్థానాన్ని చేరుకోవడంలో కష్టాలు, స్నేహం ఇలా ఎటువంటి సమస్యకైనా సరే చాణక్య సూత్రాలతో పరిష్కారం దొరుకుతుంది.
చాణక్య డబ్బు మనిషి గౌరవం పెంచుతుందని నమ్మారు. ఒక వ్యక్తి ఎంత నేర్చుకున్నా తెలివైనవాడైనా సరే డబ్బు పోగొట్టుకున్నప్పుడు అతను పరధ్యానంలో ఉంటాడు అన్నారు. అలానే తన సంపదని తానే రక్షించుకోవాలని నమ్మారు. అయితే చాణక్య ఎటువంటి కష్టాలనైనా ఎలా ఎదుర్కోవాలి.. ఎలాంటి కష్టంలోనైనా సరే ఎలా నిలబడాలి అనేది ఈ విధంగా చాణక్య చెప్పినట్లు చేస్తే కచ్చితంగా బయటపడవచ్చు. జీవితంలో ఆర్ధిక అభివృద్ధి చెందాలంటే ఎప్పుడూ మీ లక్ష్యాన్ని నిర్దేశించుకుంటూ నడవాలని చాణక్య అన్నారు.
లక్ష్యానికి ప్రాధాన్యత ఇచ్చి జీవితంలో ముందుకు వెళితే కచ్చితంగా సక్సెస్ ని అందుకోవచ్చు. పురుషులు ఎంత సంపాదిస్తున్నారనే విషయాన్ని ఎవరికీ చెప్పకూడదని చాణక్య అన్నారు ఎప్పుడైనా సరే ఆర్థిక కష్టం కలిగితే ఎవరితోనూ పంచుకోకూడదు. తెలివిగా ఖర్చు చేసుకోవాలి. డబ్బులని సరైన స్థలం లో పెట్టే అతనికి ఆపద సమయంలో ఎవరి ముందు చేయచాల్సిన అవసరం ఉండదని చాణక్య చాణక్య నీతి ద్వారా చెప్పారు. ఇలా కనుక చేశారంటే కష్టాలే రావు. కష్టాల సమయంలో కూడా నిలబడవచ్చు కాబట్టి చాణక్య చెప్పిన విధంగా అనుసరించి ఏ బాధ లేకుండా ఉండండి సమస్యలే రావు. ఒకవేళ వచ్చినా వాటి నుండి మీరు బయటపడొచ్చు.