వర్షాకాలంలో పిల్లలు ఆరోగ్యం కోసం వీటిని పాటించండి..!

-

వర్షాకాలం వచ్చిందంటే చాలు పిల్లలు వర్షంలో తడిసి అల్లరి చేస్తూ ఉంటారు. నిజంగా వర్షాకాలంలో పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. లేకపోతే సులువుగా అనారోగ్య సమస్యలు పడిపోయే అవకాశం ఉంది. మీరు పిల్లలని ఎలా జాగ్రత్తగా చూసుకోవాలి అనే దానికి ఇక్కడ కొన్ని టిప్స్ ఉన్నాయి. వీటిని కనుక అనుసరిస్తే తప్పకుండా మీ పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు.

వర్షాకాలంలో ఎక్కువగా అనారోగ్య సమస్యలు వస్తాయి. పచ్చ కామెర్లు, డెంగ్యూ, టైఫాయిడ్ వంటి జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. అదే విధంగా బ్యాక్టీరియల్ డిసీజెస్ కూడా వస్తూ ఉంటాయి. అయితే పిల్లల్లో జలుబు, డెంగ్యూ, మలేరియా టైఫాయిడ్ లాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా జాగ్రత్తపడాలంటే నీరు నిల్వ ఉండిపోకుండా చూసుకోండి.

సరైన శానిటేషన్ లేకపోతే నీరు నిల్వ ఉండిపోయి.. దీని కారణంగా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఏది ఏమైనా పిల్లల్ని ప్రొటెక్ట్ చేయడం చాలా ముఖ్యం. వీటిని కనుక అనుసరిస్తూ తప్పకుండా మీ పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు.

హైజీన్:

హైజీన్ అనేది చాలా ముఖ్యం. శుభ్రత పాటిస్తే ఆరోగ్యంగా ఉండొచ్చు. మీ పిల్లల్ని మీరు శుభ్రంగా ఉంచండి. ఎక్కువగా నీరు నిల్వ ఉండిపోవడం వల్ల దోమలు వస్తూ ఉంటాయి.

దోమలు కుట్టడం వల్ల వర్షాకాలంలో చాలా సమస్యలు వస్తాయి. అందుకని దోమలు నెట్ వంటివి కట్టడం, దోమలు కుట్టకుండా ముందుగానే క్రీమ్ అప్లై చేయండం లాంటివి చేయండి.

ఈ ఆహారానికి దూరంగా ఉంచండి:

పిల్లలు ఎక్కువగా పిజ్జా, బర్గర్ ఇలాంటివి తినడానికి ఇష్టపడుతుంటారు. ఇలాంటి జంక్ ఫుడ్ తినడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుంది. అలానే వీధిలో అమ్మే ఆహారం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. వీటి ద్వారా బ్యాక్టీరియల్ సమస్యలు వస్తాయి.

విటమిన్ సి తీసుకోవడం:

విటమిన్ సి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. ఎక్కువగా బత్తాయి, నిమ్మ, ఆపిల్, అరటి పండ్లు, టమాటా, బీట్రూట్ లాంటివి తీసుకోండి. దీనితో రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుంది.

పోషకాహారం తీసుకోవడం:

మీ పిల్లలు తీసుకునే ఆహారంలో రోగనిరోధకశక్తిని పెంపొందించే ఆహారం, ఆకుకూరలు, పండ్లు, ఉండేటట్లు చూడండి. ఇలా వర్షాకాలంలో మీ పిల్లలు ఆరోగ్యంగా ఉండొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version