మనం తీసుకునే ఆహారం, మన జీవన విధానం బట్టి మన ఆరోగ్యం ఉంటుంది. అయితే ఈ రోజుల్లో చాలా మందికి జీర్ణ సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా గ్యాస్, ఎసిడిటీ, బ్లోటింగ్ లాంటివి. అయితే ఇటువంటి వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే కచ్చితంగా ఈ పద్ధతిని అనుసరించండి. దీనితో జీర్ణ సమస్యలు ఉండవు. మరి ఇక ఆలస్యం ఎందుకు దీని కోసం ఇప్పుడే పూర్తిగా చూసేయండి.
సరిగ్గా నమలడం:
జీర్ణం అనేది మొదట నోటి నుండి మొదలవుతుంది. సలైవాలో వుండే ఎంజైమ్స్ జీర్ణ ప్రక్రియ మొదలు పెడతాయి. అయితే చాలా మంది వేగంగా నమలకుండా తినేస్తుంటారు. అలా కాకుండా నెమ్మదిగా నమిలి తినడం అలవాటు చేసుకోవాలి.
చద్దన్నం తినడం:
చద్దన్నం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది గ్యాస్టిక్, ఎసిడిటి మరియు కాన్స్టిపేషన్ సమస్యలను దూరం చేస్తుంది కాబట్టి ఉదయాన్నే చద్దన్నం తినడం మంచిది.
ఆపిల్ సైడర్ వెనిగర్:
ఆపిల్ సైడర్ వెనిగర్ కాన్స్టిపేషన్ మరియు గ్యాస్ట్రిక్ సమస్యలను దూరం చేస్తుంది. ఒక గ్లాసు నీళ్ళలో ఒక టేబుల్ స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ వేసుకొని భోజనానికి అరగంట ముందు తీసుకుంటే మంచిది.
సరిపడా ఫైబర్ తీసుకోవడం:
పండ్లలో మరియు కూరగాయలలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు ఎక్కువ ఫైబర్ ఉండే ఆహార పదార్థాలు తీసుకోవడం మంచిది.
భోజనం చేసిన తర్వాత జీలకర్ర లేదా యాలుకలు:
భోజనం చేసిన తర్వాత జీలకర్ర కానీ యాలుకల కానీ తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్, ఎసిడిటి సమస్యలు ఉండవు.
సరైన సమయానికి తినడం:
ప్రతి రోజు కూడా ఆహారాన్ని సరైన సమయానికి తినాలి చాలా మంది తినకుండా స్కిప్ చేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల ఇబ్బందులు వస్తాయి. అదే విధంగా ఒత్తిడి, నిద్ర కూడా ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుందని గమనించండి.