మధుమేహంతో బాధ పడుతున్నారా..? అయితే మీకోసం కొన్ని చిట్కాలు ఇక్కడ ఉన్నాయి. వాటిని కనుక మీరు అనుసరించారు అంటే డయాబెటిస్ ని కంట్రోల్ లో ఉంచుకోవడానికి వీలవుతుంది. మరి ఇక ఆలస్యం ఎందుకు వాటి కోసం కూడా చూసేయండి.
డయాబెటిస్ ఉండే వాళ్ళు ఆహార విషయంలో తగినన్ని జాగ్రత్తలు పాటించాలి. లేకపోతే అనేక సమస్యలకు గురయ్యే అవకాశం ఉంది అయితే ఈ విధంగా పాలు తాగడం వల్ల మంచి బెనిఫిట్స్ కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ఆ చిట్కాలను ఇప్పుడు చూసేద్దాం.
దాల్చిన చెక్క తో పాలు:
పాలల్లో దాల్చిన చెక్క వేసుకుని తీసుకోవడం వల్ల డయాబెటిస్ పేషెంట్లు కి మేలు కలుగుతుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. పాలు మరియు దాల్చిన లో క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, విటమిన్స్ ఉన్నాయి. అదే విధంగా ఇందులో బీటా-కెరోటిన్, ఆల్ఫా కెరోటిన్ కూడా ఉన్నాయి. పాలల్లో కొద్దిగా దాల్చినచెక్క వేసుకుని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్లో ఉంటాయి.
బాదం పాలు:
పాలల్లో బాదం వేసుకుని తీసుకోవచ్చు. లేదు అంటే మార్కెట్లో దొరికే బాదం పౌడర్ ని తీసుకుని బాదం మిల్క్ చేసుకోవచ్చు. వీటిలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి మరియు విటమిన్ డి విటమిన్ ఈ ఉంటాయి. ప్రోటీన్ మరియు ఫైబర్ కూడా ఉంటాయి. దీనిని తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్లో ఉంటాయి.
పసుపు పాలు:
పసుపు వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో మనకి తెలుసు. అయితే పాలలో చిటికెడు పసుపు వేసుకొని తీసుకోవడం వల్ల డయాబెటిస్ పేషంట్స్ కి చాలా మేలు కలుగుతుంది.