200మందితో ఢిల్లీకి ఈట‌ల రాజేంద‌ర్ ప‌యనం.. ప్ర‌ముఖ నేత‌లూ ఆయ‌న వెంటే!

-

ప్ర‌స్తుతం ఈట‌ల రాజేంద‌ర్ వ్య‌వ‌హారమే ఇప్పుడు తెలంగాణ రాజ‌కీయాల్లో సంచ‌ల‌నంగా మారింది. అంద‌రూ అనుకున్న‌ట్టు గానే ఆయ‌న ఈ రోజు త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసి సంచల‌నం రేపారు. దీంతో హుజూరాబాద్‌లో ఇక మిగిలింది స‌మ‌ర‌మే అంటూ స‌వాల్ విసిరారు. ఇక త‌రువాయి భాగ‌మైన బీజేపీలో చేర‌డానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

 

అయితే ఈట‌ల రాజేంద‌ర్ అంటే తెలంగాణ వ్యాప్తంగా పెద్ద పట్టున్న నేత‌. మ‌రి అలాంటి వ్య‌క్తిని చేర్చుకోవ‌డానికి బీజేపీ కూడా ప్ర‌త్యేక‌మైన ఏర్పాట్లు చేస్తోంది. ఇప్ప‌టికే ఏ నేత‌కు ఇవ్వ‌నంత ప్రాముఖ్య‌త‌ను ఈట‌ల‌కు ఇచ్చారు బీజేపీ నేత‌లు. ఇక వారి న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టుకునేందుకు ఈట‌ల కూడా సిద్ధ‌మ‌య్యారు.

అయితే త‌న బ‌ల‌గాన్ని చూపించుకునేందుకు దాదాపు 200మంది స‌భ్యుల‌తో ఢిల్లీకి వెళ్లేందుకు ప‌య‌న‌మ‌వుతున్నారు ఈట‌ల రాజేంద‌ర్‌. అలాగే కీల‌క నేత‌లైన ఏనుగు ర‌వీంద‌ర్‌రెడ్డి, తుల ఉమ‌, అశ్వ‌త్థామ‌రెడ్డి, ఇంకొంద‌రు టీఆర్ ఎస్‌కు చెందిన ప్ర‌ముఖ నాయ‌కులు కూడా వెళ్తున్న‌ట్టు తెలుస్తోంది. వారంద‌రినీ ఢిల్లీకి తీసుకెళ్లి న‌డ్డా స‌మ‌క్షంలో చేర‌నున్నారు ఈట‌ల రాజేంద‌ర్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version