రాత్రిపూట తొందరగా నిద్రపట్టట్లేదా..? ఇలా చేస్తే హాయిగా నిద్రపోవచ్చు..!

-

రాత్రి ప్రశాంతంగా నిద్ర పోవాలని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ కొంతమందికి రాత్రి పూట అసలు నిద్ర పట్టదు. త్వరగా నిద్ర పోలేకపోతుంటారు. అలాగే ప్రశాంతంగా నిద్ర పోలేకపోతుంటారు. మీరు కూడా రాత్రిపూట సరిగ్గా నిద్రపోలేకపోతున్నారా? తొందరగా నిద్ర పోవాలని అనుకుంటున్నారా? అయితే ఇలా చేయండి. వీటిని ఫాలో అవ్వడం వలన హాయిగా నిద్రపోవడానికి అవుతుంది. ఎంతో ప్రశాంతంగా నిద్రపోవచ్చు. రాత్రిపూట త్వరగా నిద్ర పోవాలంటే ఒకే సమయానికి నిద్రపోయి ఒకే సమయానికి నిద్ర లేవడం అలవాటు చేసుకోవాలి. రాత్రిపూట తొందరగా పడుకుని ఉదయం తొందరగా నిద్ర లేస్తే మంచిది. అలాగే వ్యాయామం చేయడం వలన శరీరం ఫిట్ గా ఉంటుంది.

వ్యాయామం చేయడం వలన రాత్రి బాగా నిద్ర పడుతుంది. ప్రతిరోజు వ్యాయామం చేస్తే ఆరోగ్యం చాలా బాగుంటుంది నిద్ర కూడా హాయిగా పడుతుంది. బాగా నిద్ర పోవాలంటే మంచి వాతావరణం ఉండేటట్టు చూసుకోవాలి. మీరు పడుకునే బెడ్ రూమ్ పిల్లో కవర్స్ బెడ్ షీట్లు వంటివి బాగా ఉండాలి. అలాగే వెలుతురు కూడా లేకుండా చీకటిగా ఉండేటట్టు చూసుకోవాలి. గదిలో వెలుతురు వలన కూడా నిద్ర పై ప్రభావం పడుతుంది.

మానసికంగా ప్రశాంతంగా ఉంటే హాయిగా నిద్రపోవడానికి అవుతుంది. త్వరగా నిద్ర పోవచ్చు. పుస్తకాలు చదవడం, శ్వాస సంబంధిత వ్యాయామాలు చేయడం వంటివి ఫాలో అవ్వడం వలన బాగా నిద్ర పడుతుంది. మంచిగా నిద్ర పోవాలంటే రాత్రి టీవీ, ఫోన్ వంటి వాటికి దూరంగా ఉండాలి. అప్పుడే హాయిగా ప్రశాంతంగా నిద్రపోవడానికి అవుతుంది నిద్రపోవడానికి ముందు కాఫీ వంటివి తీసుకోవద్దు. ఇలాంటివి తీసుకుంటే నిద్ర పట్టదు. ఇబ్బంది ఎదుర్కోవాల్సి ఉంటుంది. రాత్రి ఆహారం తేలికగా తీసుకోవాలి అప్పుడే హాయిగా ప్రశాంతంగా నిద్రపోవడానికి అవుతుంది. ఇలా ఇక్కడ చెప్పినట్లు మీరు ఫాలో అయినట్లయితే హాయిగా నిద్రపోవచ్చు ప్రశాంతంగా నిద్ర పడుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version