2014 కి ముందు రైతులు లేనట్టు కాంగ్రెస్, బీఆర్ఎస్ మాట్లాడుతున్నాయి : పాయల్ శంకర్

-

2014 కి ముందు రైతులే లేనట్టు కాంగ్రెస్, బీఆర్ఎస్ మాట్లాడుతున్నాయి బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు. రైతు భరోసా చర్చ సందర్భంగా ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. మేమే వ్యవసాయాన్ని సృష్టించినట్టు కాంగ్రెస్, బీఆర్ఎస్ మాట్లాడుతున్నాయి. వ్యవసాయం రాష్ట్రానికి సంబంధించిన అంశం అన్నారు. రాష్ట్రంలో ఉన్న రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. వ్యవసాయానికి కేంద్రం చేసిన సాయం గురించి ఎవ్వరూ మాట్లాడలేదు. రాజకీయాలంటే దూసించుకోవడమే అనేలా మాట్లాడుతున్నారని తెలిపారు. 

ఈరోజు పత్తికి మార్కెట్ లో ధర లేదు. సీసీఐ పత్తి కొనకుంటే లక్షల మంది రైతులు రోడ్డున పడేవారు. కేంద్ర సాయంతో 1.20 కోట్ల టన్నుల పత్తిని సీసీఐ తీసుకుంది. సీసీఐ కొనుగోలు చేసిన పత్తిలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఒక్క రూపాయి కూడా లేదు. పీఎం కిసాన్ ద్వారా వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో కేంద్రం ఇస్తోంది. మోడీ ఇస్తున్న పైసలు వస్తున్నాయి. రాష్ట్రం నుంచి మాత్రం పైసలు రావడం లేదని రైతులు మాట్లాడుకుంటున్నారు. జనవరి నుంచి రైతు భరోసా ఇస్తామంటున్నారు సంతోషం. టమాట ధర రూ.15కి పడిపోయింది. రైతు ఈ నాటికి సంతోషంగా లేడు. రైతుల పిల్లలు కార్పొరేట్ స్కూల్ లో చదివినా.. ఆస్పత్రికి వెల్లినా 90 శాతం భారం ప్రభుత్వమే భరించాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version