కొంపల్లి రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు..!

-

కొంపల్లి లోని పలు రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. కొంపల్లి మునిసిపల్ పరిధిలోని రెస్టారెంట్ లు ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించట్లేదన్న ఆరోపణలతో అధికారులు తనిఖీలు చేయగా.. ఉలవచారు, మల్నాడు కిచెన్, ట్రైన్ థీమ్ రెస్టారెంట్ లు ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించట్లేదని గుర్తించారు అధికారులు. నాన్ వెజ్ ఐటమ్స్ లో సింథటిక్ ఫుడ్ కలర్స్ కలిపినట్టు గుర్తించారు. అలాగే కుళ్లిపోయిన టమాటాలు కూడా వాడుతున్నట్లు గుర్తించారు.

ఇక అక్కడ కిచెన్ పరిసరాలు పూర్తిగా అపరిశుభ్రంగా ఉన్నాయన్న ఫుడ్ సేఫ్టీ అధికారులు.. కిచెన్ లో బొద్దింకలు ఉన్నట్టు స్పష్టం చేసారు. అలాగే ఎక్స్పైర్ అయిన ప్రొడక్ట్స్ వాడుతున్నట్లు గుర్తించిన అధికారులు.. వెజ్, నాన్ వెజ్ ఒకే ఫ్రిజ్లో స్టోర్ చేస్తున్నట్టు తెలిపారు. అదే విధంగా aబటర్ అప్లై చేయడానికి పెయింటింగ్ బ్రష్ వాడుతున్నాయి ఈ రెస్టారెంట్లు. అలాగే తుప్పు పట్టిన ఫ్రిడ్జ్ లో ఫుడ్ ఐటమ్స్ స్టోర్ చేస్తున్నారు నిర్వాహకులు. దీంతో వారి పై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలిపారు ఫుడ్ సేఫ్టీ అధికారులు.

Read more RELATED
Recommended to you

Latest news