సూర్యాపేట జిల్లా.. కోదాడ బాలికల మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ లో విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి. అనంతరం విద్యార్థినిలతో కలిసి లంచ్ చేసారు మంత్రి. ఈ సందర్భంగా కొన్ని కీలక కామెంట్స్ చేసారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ లో నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది అని ఆయన పేర్కొన్నారు.
అయితే సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సహా మొత్తమ్ మంత్రి మండలి అంతా నాణ్యమైన విద్య, పాఠశాలలలో అన్ని సౌకర్యాల కోసం కృషి చేస్తుంది. సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ పార్టీ కష్టపడుతుంది అని పేర్కొన్నారు. అలాగే కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాలలో పేదలందరికీ నాణ్యమైన విద్య అందించడమే నా లక్ష్యం అని స్పష్టం చేసారు మంత్రి ఉత్తమ్.