హెపటైటిస్ సమస్య ఈ మధ్యకాలంలో చాలామందికి వస్తుంది. ముఖ్యంగా గర్భిణులు, వృద్ధులు ఎక్కువగా ఈ వ్యాధి భారిన పడుతున్నారు. మన దేశంలో పోల్చితే..న్యూజిలాండ్‌లో ఈ వ్యాధి భారిన పడే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుందట.. కారణం ఏంటని పరిశోధన చేయగా షాకింగ్ విషయం బయటపడింది.. ఫ్రోజెన్ బెర్రీలను ఆ దేశం 2015లో ఎక్కువగా దిగుమతి చేసుకుందట..చిక్కు అంతా అక్కడొచ్చింది.!
2015లో ఈ దేశం దిగుమతి చేసుకున్న ఫ్రోజెన్ బెర్రీలకు, హెపటైటిస్ ఏ వ్యాధి వ్యాప్తికి సంబంధం ఉన్నట్లు ఫుడ్ సేఫ్టీ సంస్థ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ విన్సెంట్ అర్బకిల్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ వ్యాధి భారీన పడిన ముగ్గురు వ్యక్తుల్లోని వైరస్ జీనోటైపింగ్‌లో ఈ మార్పును గమనించినట్లు అర్బకిల్ తెలిపారు.
ఫ్రోజెన్ బెర్రీలను తినడం వల్ల హెపటైటిస్ A భారిన పడే ప్రమాదం అధికంగా ఉన్నట్లు’ ఆయన వెల్లడించారు. ‘న్యూజిలాండ్‌లో వేసవి కాలంలో ఫ్రాజెన్ బెర్రీలను ఎక్కువగా తింటారు. ఐతే వీటిని తినే ముందు నిముషం పాటు 85 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలో ఉడకబెట్టాలని న్యూజిలాండ్ ఫుడ్ సేఫ్టీ ఏజెన్సీ సూచిస్తుంది.. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ఈ పండ్లను తినేముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవల్సి ఉంటుంది.
నిజానికి హెపటైటిస్ ఏ అనే వైరస్ ఈ వ్యాధిని వ్యాపింపజేస్తుంది. ఈ వ్యాధి బారీన పడ్డవారికి లివర్ పూర్తిగా దెబ్బతింటుంది. న్యూజిలాండ్‌లో ఈ వ్యాధి అరుదుగా ఉన్నప్పటికీ భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో హెపటైటిస్ ఏ సర్వసాధారణం అయిపోయింది.. అందులోనూ ఇది అంటువ్యాధి కావడం వల్ల సులువుగా వ్యాపిస్తుంది.
ఈ వ్యాధి భారిన పడితే వికారం, కడుపు నొప్పి, పసుపు కామెర్లు వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొంతమందిలో ఎటువంటి లక్షణాలు కన్పించకపోవచ్చు. వ్యాధి ముదిరితే మాత్రం జ్వరం, కామెర్లు, ఆకలి మందగించడం, వికారం, అలసట వంటి లక్షణాలు కన్పిస్తాయి.
ఏది ఏమైనా..ఫ్రూట్స్ ఆరోగ్యానికి మంచివే అయినప్పటికీ వాటిని తినేముందు.. క్లీన్ చేసుకొని తినాలి. పైన పైన క్లీన్ చేస్తే లోన లోన రోగాలు ముంచెత్తుత్తాయి.