బ్లడ్‌ క్లాట్స్‌ ఏర్పడకుండా ఉండాలంటే.. వీటిని తీసుకోవాలి..!

-

మన శరీరంలో ఉండే రక్తం గడ్డలు కడితే అవి రక్తనాళాల్లో అడ్డంకులు సృష్టించి ఆ తరువాత హార్ట్‌ ఎటాక్‌ను తెచ్చి పెడతాయనే సంగతి అందరికీ తెలిసిందే. అయితే రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టేందుకు అనేక కారణాలు ఉంటాయి. కానీ ఆ విషయం మనకు తెలియదు. ఇక ఏదో ఒక సమయంలో సమస్య తీవ్రతరమై హార్ట్‌ ఎటాక్‌ వస్తుంది. అయితే అంత వరకు రాకుండా ఉండాలంటే.. కింద సూచించిన ఆహారాలను నిత్యం తీసుకోవాలి. దీంతో రక్తం గడ్డ కట్టకుండా చూసుకోవచ్చు. ఈ క్రమంలో ఇతర గుండె జబ్బులు కూడా రాకుండా ఉంటాయి. మరి ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

1. విటమిన్‌ డి ఉన్న ఆహారాలను ఎక్కువగా తీసుకుంటే రక్తం గడ్డ కట్టకుండా ఉంటుంది. విటమిన్‌ డి మనకు సూర్యరశ్మి ద్వారా మాత్రమే కాకుండా పుట్ట గొడుగులు, చీజ్‌, పాలు, కోడిగుడ్లు, చేపల్లో ఎక్కువగా లభిస్తుంది. ఈ ఆహారాలను నిత్యం తీసుకోవడం వల్ల రక్తం గడ్డ కట్టకుండా ఉంటుంది.

2. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉండే చేపలు, అవిసె గింజెలు, అవకాడోలు, వాల్‌నట్స్‌ను నిత్యం ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా కూడా బ్లడ్‌ క్లాట్స్‌ ఏర్పడకుండా చూసుకోవచ్చు.

3. హైబీపీ ఉన్నవారికి వెల్లుల్లి అమోఘంగా పనిచేస్తుంది. నిత్యం రెండు మూడు వెల్లుల్లి రెబ్బలను ఉదయాన్నే పరగడుపునే తింటుంటే గుండె సమస్యలు రాకుండా ఉంటాయి. రక్తం గడ్డ కట్టకుండా ఉంటుంది.

4. అల్లం రసం, అశ్వగంధ చూర్ణం, ఉల్లిపాయలు తదితర ఆహారాలను ఎక్కువగా తీసుకుంటున్నా రక్తం గడ్డ కట్టకుండా చూసుకోవచ్చు. గుండె జబ్బులు రాకుండా ఉంటాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version