దిశ ఎన్‌కౌంట‌ర్ నిందితుల పోస్టుమార్టం ఎక్క‌డ‌… ఎలా

-

మొత్తానికి వెట‌ర్న‌రీ డాక్ట‌ర్ దిశ నిందితుల‌ను ఎన్‌కౌంట‌ర్ చేయ‌డంతో ఈ కేసు క‌థ సుఖాంత మైన‌ట్లు అయ్యింది. వాస్త‌వంగా ఈ నిందిదుల‌ను జైల్లో ఉంచి మ‌రి కొన్ని రోజులు పాటు కేసులు, కోర్టులు అని తిప్పి ఉంటే చ‌ట్టాలు, పోలీసులు, ప్ర‌భుత్వాల‌పై సామాన్య ప్ర‌జ‌ల‌కు ఎలాంటి న్యాయం జ‌రిగి ఉండేది కాదు. ఇక ఎప్పుడైతే వీరిని నిర్దాక్షిణ్యంగా ఎన్ కౌంట‌ర్ చేసి ప‌డేశారో ఒక్క‌సారిగా హ‌ర్షాతిరేకాలు స్టార్ట్ అయ్యాయి.

వీరి విష‌యంలో ప్ర‌భుత్వం, పోలీసుల‌పై సైతం విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఇక రంగారెడ్డి జిల్లా ప‌రిధిలో
చటాన్ పల్లి జాతీయ రహదారిపై ఉన్న బ్రిడ్జ్ కింద, ఎక్కడైతే దిశను దారుణంగా కాల్చేశారో, అక్కడికి సరిగ్గా 300 మీటర్ల దూరంలో నిందితులు ఆరిఫ్, శివ, నవీన్, చెన్నకేశవులు మృతదేహాలు చెల్లాచెదరుగా పడి కనిపిస్తున్నాయి. ఇక ఈ రోజు తెల్ల‌వారు ఝామున 3-6 గంట‌ల ప్రాంతంలో ఈ సంఘ‌ట‌న జ‌రిగిన‌ట్టుగా సీపీ స‌జ్జ‌నార్ చెప్పారు.

సీన్ రీకన్ స్ట్రక్షన్ సమయంలో వీరంతా పారిపోయేందుకు ప్రయత్నించారు. పోలీసుల ఆయుధాలు లాక్కోవడంతో పాటు రాళ్లను విసురుతూ పొలాల మీదుగా పరిగెత్తేందుకు ప్రయత్నించగా పోలీసులు కాల్పులు జరిపి వారిని హతమార్చిన సంగతి తెలిసిందే. ఇక సంఘ‌ట‌న స్థ‌లంలో వీరి మృత‌దేహాలు పొలాలు, తుప్ప‌ల మ‌ధ్య 30 మీట‌ర్ల దూరంలో ప‌డి ఉన్నాయి.

ప్రస్తుతం మృతదేహాలను పరిశీలిస్తున్న పోలీసు ఉన్నతాధికారులు, మరికాసేపట్లో వీటిని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలిస్తారని తెలుస్తోంది. భారీగా తరలివస్తున్న ప్రజలను నియంత్రించడం క్లిష్టతరంగా మారిందని పోలీసులు అంటున్నారు. ఇక పోలీసుల‌పై సంఘ‌ట‌న స్థ‌లంలో ప్ర‌జ‌లు వంతెన‌పై నుంచి పూల వ‌ర్షం కురిపిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version