షాద్‌నగర్‌లో జరిగిన ‘దిశ’ ఘటన నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. నిందితులను ఎన్‌కౌంటర్ చేయడంపై మెజార్టీ ప్రజానీకం హర్షం వ్యక్తం చేస్తోంది. అలాగే మరోవైపు దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై ఆమె తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. అలాగే ఎన్ కౌంటర్ లో హతులైన నలుగురి మృతదేహాలనూ చూడాలని అనిపిస్తోందని వెటర్నరీ వైద్యురాలు దిశ తల్లి వ్యాఖ్యానించారు. ఈ ఉదయం తనను కలిసిన మీడియాతో మాట్లాడిన ఆమె, షాద్‌నగర్ దగ్గర ఎన్‌కౌంటర్ చేసినట్లు తనకు తెలిసిందని అన్నారు.
దిశ మరణించిన 10 రోజులకు న్యాయం జరిగిందని, ఇందుకు పోలీసులకు, మీడియాకు కృతజ్ఞతలు చెబుతున్నానని అన్నారు. నిందితుల మరణం తమకు మనశ్శాంతిని కలిగించిందని అన్నారు. ఇంత తొందరగా తమకు న్యాయం జరుగుతుందని భావించలేదని, వారి డెడ్ బాడీలను తనకు చూపించాలని కోరారు. తన బిడ్డ లేదన్న విషయాన్ని తట్టుకోలేకపోతున్నానని, నిందితుల మరణంతో ఆమె ఆత్మకు శాంతి కలుగుతుందని అభిప్రాయపడ్డారు.