ఉగ్రవాదులకు చుక్కలు, 15 రోజుల్లో 22 మంది టాప్ కమాండర్లను లేపేసిన ఆర్మీ…!

-

ఒక నిఘా వర్గాల సహకారం మరో పక్క జమ్మూ కాశ్మీర్ పోలీసుల సహకారం… ఏ విధంగా చూసినా భారత ఆర్మీకి ఇప్పుడు కాశ్మీర్ లో అన్ని విధాలుగా పరిస్థితులు కలిసి వస్తున్నాయి. నిఘా వర్గాల సహకారం తో ఉగ్రవాదులకు చుక్కలు చూపిస్తుంది భారత ఆర్మీ. రోజుల వ్యవధిలో పదుల సంఖ్యలో ఉగ్రవాదులను కాల్చి చంపుతుంది. అడవుల్లో నక్కిన వారిని వెతికి మరీ చంపుతుంది.

వందల మంది ఉగ్రవాదులను భారత ఆర్మీ అనేక విధాలుగా టార్గెట్ చేసి వారి మీద ఫోకస్ చేసి కాల్పులకు పక్కా సమాచారంతో దుగుతుంది. కార్టన్ సెర్చ్ ఆపరేషన్ లతో ఆపరేషన్ ఆల్ అవుట్ ని విజయవంతంగా కొనసాగిస్తుంది భారత ఆర్మీ. ఈ క్రమంలోనే గత 15 రోజుల్లో ఉగ్రవాదులకు ఎప్పుడు లేని విధంగా ఎదురు దెబ్బలు తగిలాయి. గత 15 రోజుల్లో జెకెలో 8 మంది టాప్ కమాండర్లతో సహా 22 మంది ఉగ్రవాదులలను కాల్చి చంపారు.

కమాండర్ ఆదిల్ అహ్మద్ వాని మరియు లష్కర్-ఎ-తైబా (ఎల్ఇటి) కేడర్ షాహీన్ అహ్మద్ థోకర్ మే 25 న ఖుద్ హంజిపోరా ప్రాంతంలో భారత బలగాలు కాల్చి చంపాయి. జూన్ 7 న, హెచ్‌ఎం ఆపరేషన్ కమాండర్ ఉమర్ మొహియుదిన్ ధోబి, ఎల్‌ఇటి టాప్ కమాండర్ రయీస్ అహ్మద్ ఖాన్, హెచ్‌ఎం కమాండర్లు సక్లైన్ అహ్మద్ వాగే, వకీల్ అహ్మద్ లను కాల్చి చంపింది భారత ఆర్మీ. దీనితో ఇప్పుడు ఉగ్రవాదులు వెనకడుగు వేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version