రక్తప్రసరణని మెరుగు పర్చడం ద్వారా చర్మ ఆరోగ్యాన్ని ఏ విధంగా పెంచవచ్చో తెలుసా..?

-

చర్మ సంరక్షణ అనగానే మొటిమలు, నల్లమచ్చలు, గీతలు, మొదలగు వాటిని తగ్గించడానికి బయట నుండి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయినా కూడా కొన్ని సార్లు చర్మ సమస్యలు ఒక పట్టాన తగ్గవు. లోపల సమస్య ఉంటే బయట ఎలా తగ్గుతుందన్నట్టు, శరీరంలో ఎక్కడయినా ప్రాబ్లమ్ జరిగితే, అది చర్మం మీద ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా రక్తప్రసరణ సరిగ్గా లేకపోతే అనేక చర్మ సమస్యలు వస్తుంటాయి. వాటిని తగ్గించుకోవడానికి ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.

వ్యాయామం

వ్యాయామం మీ చర్మ ఆరోగ్యాన్ని పెంచుతుందనడంలో పెద్ద రహస్యమేమీ లేదు. వ్యాయామం వల్ల హృదయ స్పందనల రేటు పెరుగుతుంది. దానివల్ల రక్తప్రసరణ పనితీరు మెరుగు అవుతుంది. వారానికి ఐదు రోజులు కనీసం అరగంట సేపయినా వ్యాయామం చేయండి. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోండి.

ద్రవాలు ఎక్కువగా తీసుకోవాలి.

మీరు ఏ చర్మ వైద్య నిపుణుడిని కలుసుకున్నా ఇదే చెబుతారు. శరీరంలో నీటిశాతం తగ్గితే దాని ప్రభావం చర్మం మీద కూడా ఉంటుంది. అందుకే కావాల్సినన్ని నీళ్ళు తప్పకుండా తాగాలి. కావాలంటే జ్యూసులు తాగినా మంచిదే.

మంచి ఆహారం

ప్రాసెస్ చేసిన చక్కెర, ఉప్పు ఎక్కువగా ఉన్న పదార్థాలని ఆహారంగా తీసుకోవద్దు. ఆకుకూరలు, సిట్రస్ పండ్లని ఆహారంలో భాగం చేసుకుంటే రక్త ప్రసరణ పనితీరు బాగుంటుంది. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండడంతో శరీరానికి మేలు చేసి, రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

అప్పుడప్పుడు చల్లని నీటితో స్నానం చేయండి.

చల్లని నీటితో స్నానం చేయడం వల్ల రక్తప్రసరణలో మార్పు వస్తుంది. అందుకే అప్పుడప్పుడు మీకు వీలైనపుడు చల్లని నీళ్లతో స్నానం చేయడం ఉత్తమం.

Read more RELATED
Recommended to you

Exit mobile version