ఆ అమ్మాయి కోసం థియేటర్ లకి ఎగబడుతున్నారు ..

-

అంతకుముందు టాప్ హీరోల పక్కన స్టార్ హీరోయిన్ గా అనేక అవకాశాలు అందుకుని తర్వాత అక్కినేని నాగచైతన్య ని ప్రేమ వివాహం చేసుకున్న సమంత ప్రస్తుతం హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు చేస్తోంది. పెళ్లయిన తర్వాత సమంతా సినిమాలు ఆపేస్తుందని అందరూ భావించినా కానీ ఊహించని విధంగా అంతకుముందు కంటే ఎక్కువ సినిమాలు చేస్తూ బిజీ హీరోయిన్ గా మారింది.

హీరోయిన్ ఓరియంటెడ్ స్టోరీలు ఎంచుకుంటూ వరుస విజయాలు అందుకున్న సమంత ఇటీవల జాను అనే సినిమా నటించడం జరిగింది. ఈ సినిమాకి సమంత నటించిన పెర్ ఫార్మెన్స్ కి థియేటర్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. శర్వానంద్ మరియు సమంత కలిసి నటించిన ఈ ప్రేమ కథా చిత్రానికి ప్రేక్షకులు ప్రస్తుతం బ్రహ్మరథం పడుతున్నారు.

తమిళంలో తెరకెక్కించిన డైరెక్టర్ తెలుగులో కూడా తెరకెక్కించడం తో దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమాలో చిన్న వయసులోనే ప్రేమలో పడిన ఆ అమ్మాయి పాత్రలో ఆ భావోద్రేకాలను వెండితెరపై పండించడంలో సమంత నటన హైలెట్ కావడంతో ప్రేక్షకులు సమంత లేకపోతే సినిమా లేదని అదిరిపోయే క్యారెక్టర్లో సమంత నటించిందని అంటున్నారు. చాలామంది ప్రేక్షకులు సినిమాని మళ్లీ మళ్లీ సమంత క్యారెక్టర్ కోసం చూడటానికి ఎగబడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version