NC22 : చైతూ సినిమాలో వంటలక్క..ఫస్ట్ లుక్ రిలీజ్

-

NC22 : హీరో నాగ చైతన్య.. ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ… ముందుకు సాగుతున్నారు. ఇందులో NC 22 పేరుతో ప్రస్తుతం వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో నాగ చైతన్య సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్‌ ఇంకా ప్రారంభం కాకపోయినా.. ఈ సినిమాలో నాగ చైతన్య సరసన కృతి శెట్టి హీరోయిన్‌ గా నటిస్తోన్నట్లు ఇప్పటికే చిత్ర బృందం రివీల్‌ చేసింది.

ఇప్పటికే ఈ జంట బంగార్రాజు సినిమాలో మెరిసిన సంగతి తెలిసిందే. ఇవాళ ఈ సినిమా నుంచి వరుసగా అప్డేట్స్‌ ను వదులోంది చిత్ర బృందం. ఈ సినిమాలో ప్రియమణీ నటిస్తున్నట్లు తాజాగా ప్రకటించింది చిత్ర బృందం. ఈ మేరకు ప్రియమణి పోస్టర్‌ ను రిలీజ్‌ చేశారు. అయితే.. మరో పోస్టర్‌ కూడా వదిలింది. ఈ సినిమాలో వంటలక్క కూడా నటిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు వంటలక్క పోస్టర్‌ ను వదిలింది చిత్ర బృందం.

Read more RELATED
Recommended to you

Exit mobile version