అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు పై ఫోకస్ చేసింది జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఇందులో భాగంగానే… కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమవుతోంది. ఇందులో భాగంగానే ఒకటి, రెండు రోజుల్లో నోటిఫికేషన్ జారీ చేయనుంది ఏపీ ప్రభుత్వం. లోక్‌సభ నియోజక వర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చింది వైసీపీ పార్టీ.
ఇందులో భాగంగానే… దీనిపై ఇప్పటికే సంప్రదింపులు పూర్తి చేసింది వైసీపీ ప్రభుత్వం. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 25 లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్నాయి. గిరిజన ప్రాంతమైన అరకు పార్లమెంట్ సెగ్మెంట్ ను మాత్రం రెండు జిల్లాలుగా మార్చనుంది ప్రభుత్వం. దీంతో ప్రస్తుతం ఉన్న 13 జిల్లాల స్థానంలో 26 జిల్లాల రాష్ట్రం కానుంది. పెరిగిన జనాభాకు అనుగుణంగా పరిపాలనను ప్రజలకు చేరువ చేయాలనే ఉద్దేశంతో కొత్త జిల్లాల ప్రతిపాదన చేస్తుంది ఏపీ ప్రభుత్వం.