ఆస్ట్రేలియాతో జరగబోయే టెస్టు సిరీస్లో భాగంగా మొదటి మ్యాచ్ ముగియగానే తన భార్య ప్రసంగం కారణంగా విరాట్ కోహ్లీ భారత్ తిరిగి రానున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ లేకుండానే భారత జట్టు ఆస్ట్రేలియాతో తలపడనుంది. దీనిపై స్పందించిన ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. విరాట్ కోహ్లీ లేకుండా భారత జట్టు ఆస్ట్రేలియాతో గెలవడం కష్టమే అంటూ చెప్పుకొచ్చాడు.
ప్రస్తుతం ప్రపంచంలోనే విరాట్ కోహ్లీ అత్యుత్తమ ఆటగాడు మాత్రమేకాదు ఎంతో అద్భుతమైన నాయకత్వ లక్షణాలు కలిగి ఉన్న సారది కూడా అంటూ చెప్పుకొచ్చాడు. ఒకవేళ విరాట్ కోహ్లీ స్థానంలో మహేంద్ర సింగ్ ధోనీ ఉండి.. ధోని ఇలా ఒక మ్యాచ్ తర్వాత టీ మీడియాకు దూరం అయితే తాను ఎలాంటి వ్యాఖ్యలు చేసేవాడిని అంటూ చెప్పుకొచ్చాడు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్.