ప్రపంచంలో వింతలు, అద్భుతాలు అప్పుడపుడు పుట్టుకొస్తున్నాయి. ఇక దక్షిణ ఆఫ్రికాలోని కేప్ టౌన్‌కి దగ్గర్లో ఉన్న ఫిష్ హోక్ సముద్ర తీరానికి ఈమధ్య వింత జీవులు కొట్టుకొచ్చాయి. వాటి ఆకారం చాలా చిత్రంగా ఉంది. బ్లూ, వయలెట్ కలర్లో… పక్షుల రెక్కల లాంటి రెక్కలతో.. డ్రాగన్ ఆకారంలో ఉన్నాయి ఆ వింత చేపలు. దాదాపు 20 చేపలు తీరంలో కనిపించాయి. వాటిని చూసినా పర్యాటకులు సముద్రం లోపల ఇక వింత జీవులు ఉన్నాయా అనే ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి..
అయితే మొదటగా మహిళ వాజెనర్ ఈ చేపల్ని చూసింది. ఆమె వాటిని ఫొటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. సముద్రంలో అందమైన హంతకి అని క్యాప్షన్ పెట్టింది. ఆ ఫొటో వైరల్ అవ్వడంతో చాలా మంది వాటిని చూసేందుకు బీచ్‌కి వచ్చారు. ఇదివరకు ఇలా సముద్రం ఒడ్డుకు వచ్చిన ఎన్నో జీవులను ఆమె తిరిగి సముద్రంలో వదిలేసేది. కానీ.. వీటి జోలికి ఆమె రాలేదు. ఎందుకంటే… వీటి ఆకారం చూసి భయపడింది. ఇవి తనకు హాని చేసే రకం కావచ్చని అనుకుంది.
అవి చూడ్డానికి చిన్నగా ఉండే ఈ చేపలకు విషం ఉంటుంది. తాము వేటాడే జీవులపై అవి విషాన్ని ప్రయోగించి చంపుతాయి. ఈ చేపలకు ముళ్లుంటాయి. వాటితో గుచ్చుతాయి. అలా గుచ్చితే… అక్కడ దురద, నొప్పు వస్తుంది. ఐతే… వీటి వల్ల మనుషులకు అంతగా ప్రాణహాని లేదు. వీటి అందం వీటిని ఎట్రాక్టివ్‌గా మార్చేసింది. ఇవి పక్షులలా, బల్లులలా, ఆక్టోపస్ లా ఉన్నాయని స్థానికులు అభిప్రాయపడ్డారు. ఈ చేపకు సంబంధించిన వీడియో ఒకటి ఫేస్బుక్లో వైరల్ అయ్యింది. సముద్రం అనంతమైనది. అందులో మనకు తెలియని ఎన్నో జీవులను ఏటా కనిపెడుతూనే ఉన్నారు. వాటిలో బ్లూ క్రాబ్స్ (నీలి పీతలు), పోర్చుగీస్‌లోని మెనోవార్, బ్లూ షెల్స్‌గా పిలిచే జంథినా జంతినా కూడా ఇలాంటివే. అవి కూడా మనల్ని ఆశ్చర్యపరుస్తాయి.