బీఆర్ఎస్ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి,రాకేష్ రెడ్డిల అరెస్టు

-

తెలంగాణలో బీఆర్ఎస్ నేతల అరెస్టుల పర్వం కొనసాగుతోంది. గురువారం ఉదయం హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేస్తారని సమాచారం రావడంతో అక్కడకు వెళ్లిన మాజీ మంత్రి హ రీశ్ రావును పోలీసులు అరెస్టు చేశారు. హరీశ్ రావు అరెస్టు అనంతరం హుజురాబాద్ ఎమ్మెల్యేను సైతం పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం.

ఈ క్రమంలో వారిని కలిసేందుకు వెళ్తున్న మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి, రాకేశ్ రెడ్డిలను సైతం పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. బంజారాహిల్స్ ఏసీపీ విధులకు ఆటంకం కలిగించారని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మీద నిన్న బంజారాహిల్స్ పీఎస్‌లో కేసు నమోదు అయిన విషయం తెలిసిందే.

 

Read more RELATED
Recommended to you

Latest news