113కోట్ల క్రికెట్ అసోసియేషన్‌ స్కాంలో మాజీ సీఎం…!

-

జమ్మూ కశ్మీర్‌ అధినేత ఫరూక్‌ అబ్దుల్లా చిక్కుల్లో పడ్డారు. క్రికెట్ అసోసియేషన్‌లో జరిగిన 113 కోట్ల గోల్‌మాల్‌.. ఫరూక్‌ మెడకు చుట్టుకుంటోంది. ఈ స్కామ్‌పై ఈడీ విచారణ చేపట్టింది. ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫరూక్‌ను ప్రశ్నించింది. ఆర్టికల్ 370ని పునరుద్ధరించాలంటూ కొత్త కూటమి ఆవిర్భవించడం వల్లే కేంద్రం కుట్రలు చేస్తోందని ఆరోపించారు కశ్మీరీ నేతలు.

మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లాను ప్రశ్నించింది ఈడీ. జమ్మూ కశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ లో 113 కోట్ల గోల్‌మాల్ జరిగింది. దీనిపై జమ్మూ పోలీసులు విచారణ చేస్తున్నారు. ఆ తర్వాత కోర్టు.. సీబీఐకి అప్పజెప్పింది. దీనిపై ఈడీ కేసును నమోదు చేసింది. అయితే ఈ వ్యవహారంపై ఫరూక్‌ను ప్రశ్నించింది. ఆర్టికల్ 370ని పునరుద్ధరించాలంటూ కశ్మీర్ వేదికగా కొత్త కూటమి ఆవిర్భవించడంతోనే కేంద్రం ఇలాంటివి చేస్తోందని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీ ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version