కేంద్ర బడ్జెట్‌పై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నాయి.బడ్జెట్‌లో కేవలం ఏపీ, బీహార్ రాష్ట్రాలకు మాత్రమే ప్రాధాన్యత కల్పించారని, ఇతర రాష్ట్రాలకు ఎలాంటి కేటాయింపులు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.ఇది కేవలం పదవిని కాపాడుకునే బడ్జెట్ మాత్రమే అని, ఎన్డీయే మిత్రపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు మాత్రమే ఎక్కువ నిధులు కేటాయించారని ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి.
తాజాగా ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కూడా కేంద్ర బడ్జెట్‌పై విమర్శలు చేస్తున్నారు. కేంద్ర బడ్జెట్‌లో బీహార్‌కి గణనీయమైన నిధులు కేటాయించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని, కేవలం రాష్ట్రానికి జుంజునా(బొమ్మ) మాత్రమే ఇచ్చారనిమండిపడ్డారు. ప్రత్యేక హోదా ఇవ్వడంపై బీహార్ ప్రజలను నితీష్ కుమార్ మోసం చేశారని విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక కేటగిరి హోదా రాకుండా బీహార్ అభివృద్ధి జరగదని ఆయన తెలిపారు. కేంద్ర బడ్జెట్‌పై కేంద్ర ప్రభుత్వం పేదలకు, రైతులకు ఒరిగిందేమీ లేదని అన్నారు.