తిరుపతి ఉప ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి కాస్త ఇప్పుడు సవాలుగానే ఉన్నాయి అనే విషయం తెలిసిందే. అయితే తిరుపతి ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది అనే అభిప్రాయం కొంతమందిలో వ్యక్తమవుతోంది. రాజకీయంగా చంద్రబాబు నాయుడుపై ఇన్నిరోజులు నమ్మకం గా ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇప్పుడు అలా లేరు అనేది పంచాయతీ ఎన్నికలు మున్సిపల్ ఎన్నికల తర్వాత స్పష్టంగా అర్థమైంది.
అయితే తెలుగుదేశం పార్టీ నుంచి కొంతమంది నేతలు ఇప్పుడు బయటకు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. తిరుపతి ఉప ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీలో తిరుపతి పార్లమెంటు పరిధిలో కొంతమంది నేతలు బయటకు రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే మాజీ మంత్రి అమర్నాథరెడ్డి కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.
అలాగే గత ఎన్నికల్లో పీలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి కూడా తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఇప్పటికే పార్టీలో ఉన్న తన సన్నిహితులతో ఆయన చర్చించారని కూడా తెలుస్తోంది. త్వరలోనే రాజీనామా చేయడానికి వీళ్లిద్దరు సిద్ధమయ్యారు. అలాగే కుప్పం నియోజకవర్గంలో కూడా కొంతమంది నేతలు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలో పార్టీ మారే అవకాశం ఉందని అంటున్నారు.