బీసీసీఐ పై సంచలన ఆరోపణలు చేసిన మాజీ క్రికెటర్..!

-

దక్షిణాఫ్రికా క్రికెటర్​ హర్షలే గిబ్స్​ గురించి ప్రతి ఒక్కరికీ తెలిసే ఉంటుంది. అతడు ఆటతో ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది క్రికెట్​ అభిమానులకు చేరువయ్యాడు. దక్షిణాఫ్రికా నేషనల్​ జట్టు నుంచి రిటైరైన తర్వాత గిబ్స్​ అడపాదడపా టీ20 లీగుల్లో మెరస్తున్నాడు. కాగా గిబ్స్​ తాజాగా భారత క్రికెట్​ కంట్రోల్​ బోర్డు బీసీసీఐ మీద చేసిన ఆరోపణలు టాక్​ ఆఫ్​ ది టౌన్​ గా మారాయి. ఇతడి ఆరోపణలను చాలా మంది క్రికెటర్లు నమ్ముతున్నారు. ఇతడికి అండగా నిలుస్తున్నారు. బీసీసీఐ వ్యవహార శైలిని తప్పు బడుతున్నారు.

 

ఇక ఏం జరిగిందంటే… పాకిస్తాన్​ దేశం నిర్వహిస్తున్న కశ్మీర్​ ప్రీమియర్ లీగ్​ లో గిబ్స్​ పాల్గొననున్నాడు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను కూడా అతడు సిద్ధం చేసుకుంటున్నాడు. కశ్మీర్​ ప్రీమియర్​ లీగ్​ నిర్వహించడం నచ్చని బీసీసీఐ అతడిని ఆ లీగ్​ లో ఆడొద్దని వారించిందట. అంతే కాకుండా కశ్మీర్​ ప్రీమియర్​ లీగ్​ లో ఆడితే తాను ఇకపై భారత్​ లో బీసీసీఐ నిర్వహించే ఏ ఈవెంట్​ లోనూ పాల్గొనేందుకు, ఆడేందుకు అనుమతించమని హెచ్చరికలు జారీ చేసిందట. ఇలా హెచ్చరికలు జారీ చేయడం సబబు కాదని గిబ్స్​ ట్విటర్​ వేదికగా బీసీసీఐ పై విమర్శలు గుప్పించాడు. అతడి వాదనలతో ఏకీభవిస్తూ… పలువురు పాకిస్తాన్​ మాజీ క్రికెటర్లు కూడా బీసీసీఐ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇంత వరకు ఈ వివాదంపై బీసీసీఐ పెద్దలు మాత్రం స్పందించకపోవడంతో అసలు విషయం తెలియడం లేదు. కాగా కశ్మీర్​ ప్రీమియర్ లీగ్​ ఆగస్టు 6వ తేదీ నుంచి మొదలు కానుంది. ఈ లీగ్​ లో మొత్తం ఆరు జట్లు పాల్గొంటుండగా… ఆరుగురు పాకిస్తానీ ప్లేయర్లు కెప్టెన్స్​ గా వ్యవహరించనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version