దక్షిణ భారతదేశంలో బీజేపీ నుంచి మొదటి సారిగా ముఖ్య మంత్రి అయిన యడియూరప్ప.. కర్నాటకలో బీజేపీని నిలబెట్టడానికి తీవ్రంగా శ్రమించారు. ప్రస్తుతం కూడా కర్నాటకలో బీజేపీ ప్రభుత్వం నిలవడానికి కారణం.. యడియూరప్ప అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం ఉండదు. మొన్నటి వరకు కూడా కర్నాటక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా యడియూరప్పనే వ్యవహరించారు. ఇటీవలే తన ముఖ్యమంత్రి పీఠాన్ని బస్వరాజ్ బొమ్మైకి ఇచ్చాడు. కాగ ఈ మాజీ సీఎం యడియూరప్ప సీఎం కాబోతున్నారు.
అయితే ఈ సారి కర్నాటక పాలిటిక్స్ లో కాకుండా.. సినిమాల్లో యడియూరప్ప సీఎం అవతారం ఎత్తబోతున్నారు. ఇప్పటి వరకు సినిమాల్లో క్రేజ్ తెచ్చుకుని.. రాజకీయాల్లో సక్సస్ అవడానికి చాలా మంది ముందుకు వచ్చారు. కొంత మంది సక్సస్ కూడా అయ్యారు. కానీ మాజీ సీఎం ఈ వయసులో రాజకీయం నుంచి సినిమా రంగంలోకి రాబోతున్నారు. హరీశ్ ఎండీ హళ్లీ అనే డైరెక్టర్ దర్శకత్వంలో వస్తున్న తనుజ అనే సినిమాలో యడియూరప్ప సీఎంగా నటించబోతున్నారు. కాగ ఇప్పటి వరకు రీయల్ గా సీఎం గా ఉన్నా యడ్డీ.. రీల్ గా ఎలా ఉంటాడో చూడాలి మరీ.