జస్టీస్ నరసింహారెడ్డి కమిషన్ పై మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి షాకింగ్ కామెంట్స్..!

-

ఛత్తీస్ ఘడ్  విద్యుత్ కొనుగోళ్లు, యాదాద్రి, భద్రాద్రి థర్మల్ ప్లాంట్ల నిర్మాణాలకు సంబంధించిన అంశాలపై విచారణ జరుపుతోన్న జస్టిస్ నర్సింహా రెడ్డి కమిషన్  మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. తెలంగాణ భవన్లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నర్సింహా రెడ్డి కమిషన్ నియమాలకు వ్యతిరేకంగా వ్యవహరించిందని అన్నారు. ప్రభుత్వ పెద్దల మాదిరిగానే కమిషన్ చైర్మన్ మాట్లాడారని అసహనం వ్యక్తం చేశారు. అందుకే కేసీఆర్ తగు రితీలో సవివరంగా సమాధానం ఇచ్చారని స్పష్టం చేశారు. కేసీఆర్ లేఖతో రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు అర్థమయ్యాయన్నారు. ఏదైనా ఒక అంశంపై విచారణ చేపట్టప్పుడు విచారణాధికారికి ఎలాంటి ఉద్దేశాలు ఉండకూదని, కానీ ఈ కమిషన్ అందుకు భిన్నంగా ఉందని అన్నారు.

ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోలు విషయంపై కాంగ్రెస్ ప్రభుత్వానికి కౌంటర్ ఇచ్చిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఛత్తీస్‌గఢ్ నుండి విద్యుత్ కొనుగోలు చేసింది రూ. 7000 కోట్లతో అయితే అందులో రూ. 6000 కోట్లు వెనకేసుకున్నరు అని అంటున్నారు. ఇదెలా సాధ్యం అవుతుంది. ఛత్తీస్‌గఢ్ పవర్ ఇవ్వనప్పుడు బయట నుండి అధిక ధరకు కొన్నారు అని అంటున్నారు. అప్పుడు 17000 మిలియన్ యూనిట్లకు రూ. 7000 మాత్రమే ఎలా అవుతుంది? కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా చూపించి తెలంగాణను అంధకారంలో తీసుకెళ్ళి మళ్లీ సమైక్య ఆంధ్ర పాలననే బాగుంటుంది అనెట్టు చేయాలని చూస్తుంది అని పేర్కొన్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version