ఈ ఎన్నికల్లో అయినా ఆ మాజీ మంత్రి ఆశ నెరవేరుతుందా

-

ఒక్కొక్కరి రాజకీయ ప్రస్థానం ఒక్కోచోటి నుంచి మొదలవుతుంది. ఆ తర్వాత ఎన్నో పదవులు అధిరోహిస్తారు. మరికొందరు అక్కడితోనే ఆగిపోతారు. ముఖ్యంగా నాయకులు తమ వారసులను రాజకీయాల్లోకి తీసుకొచ్చేటప్పుడు వారి అనుభవాలను కూడా పరిగణనలోకి తీసుకుని అడుగులు వేస్తారు. ఇలాంటి సందర్భమే అక్కడ కూడా ఎదురైంది. ఓ మాజీ మంత్రి..తన కొడుకు పదవి కోసం గట్టిగానే పట్టుబడుతున్నారు. ఈ ఎన్నికల్లో ఆయన లాబీయింగ్‌ వర్కవుట్ అవుతుందా లేక కొడుకు రాజకీయ భవిష్యత్తు మళ్లీ గందరగోళంలో పడుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది.

పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం మున్సిపల్ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. మున్సిపల్ చైర్మన్ పదవి బీసీ మహిళకు రిజర్వ్‌ కావడంతో… వైస్ చైర్మన్ పదవికి పోటీ విపరీతంగా ఉంది. మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడుకు ఈ మున్సిపాలిటీ పై పట్టుంది. అలాగే అధికార పార్టీలో ఆయనకు వెయిట్ ఉంది. దీంతో ఎవరికో ఎందుకు తన కొడుకుకే వైస్ చైర్మన్ పదవి ఇప్పించుకోవాలని చూస్తున్నారు. తన కొడుకు కొత్తపల్లి భుజంగరాయలుకు గతంలో కౌన్సిలర్‌గా చేసిన అనుభవం ఉంది. దీంతో ఈసారి మున్సిపాలిటి పై పట్టుకోసం కుమారుడి పొలిటికల్ లైఫ్ సెటిల్ చేసేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నాడు.

మొత్తం 31 వార్డులు ఉండే నర్సాపురం మున్సిపాలిటీలో… 16 వార్డులకు పైగా గెలుచుకుంటేనే చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు దక్కుతాయి. ఇక్కడ టీడీపీ నుంచి అంత గట్టి పోటీ లేకపోయినా. పదవుల కోసం పార్టీలో అంతర్గత పోటీ నెలకొంది. చైర్మన్ పదవి మహిళకు రిజర్వ్ కావటంతో వైస్ చైర్మన్ పదవి అయినా తమకు కేటాయించాలని చాలా మంది నాయకులు పట్టుబడుతున్నారు. మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు కొడుకు భుజంగరాయుడికి సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రసాదరాజు సపోర్ట్ చేస్తాడో లేదో చూడాలి.

కొత్తపల్లి సుబ్బారాయుడు తన కొడుకుకు వైస్ చైర్మన్ పదవి ఇప్పించుకోవడాన్ని చాలా సెంటిమెంట్‌గా ఫీలవుతున్నట్లు సమాచారం. ఎందుకంటే గతంలో ఆయన కూడా కౌన్సిలర్‌గా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి… అక్కడి నుంచి అనేక పదవులు చేపట్టి చివరికి మంత్రి కూడా అయ్యారు. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల వల్ల పాలిటిక్స్‌ నుంచి సైడైపోయారు. ఇప్పుడు తన కొడుకు ద్వారా పోయిన ఇమేజిని మళ్లీ సంపాదించాలనుకుంటున్నారు. ఎలాగూ అధికార పార్టీలో ఉన్నాం కాబట్టి వైస్ చైర్మన్ పదవి ఇప్పిస్తే బోలెడంత అనుభవం వస్తుందని ఆయన భావిస్తున్నట్లు సమాచారం.

ఎక్కడైనా చైర్మన్ పదవి కోసం పోటీ ఉంటుంది. కానీ నర్సాపురంలో మున్సిపాలిటీలో మాత్రం వైస్ చైర్మన్ పదవికి పోటీ ఎక్కువగా ఉంది. కొత్తపల్లి కలనెరవేరుతుందా లేదో అన్న ఆసక్తి వైసీపీ అధిష్టానం ఎవరికి ప్రాధాన్యత ఇస్తుందో అన్న సస్పెన్స్ ఇక్కడ నెలకొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version