జర్నలిస్టులను రైలు పట్టాలపై పడుకోబెడతావా? గుమ్మనూరుకు అనంత కౌంటర్‌ !

-

జర్నలిస్టులను రైలు పట్టాలపై పడుకోబెడతావా? అంటూ గుమ్మనూరుకు అనంత కౌంటర్‌ ఇచ్చారు. టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం వ్యాఖ్యలపై స్పందించారు మాజీ ఎమ్మెల్యే అనంతవెంకటరామిరెడ్డి. మీడియా ప్రతినిధులకు ఎమ్మెల్యే జయరాం వార్నింగ్ ఇవ్వడం దుర్మార్గం అంటూ ఆగ్రహించారు. వాస్తవాలు రాసే జర్నలిస్టు లను రైలు పట్టాలపై పడుకోబెతారా? అని చురకలు అంటించారు మాజీ ఎమ్మెల్యే అనంతవెంకటరామిరెడ్డి.

Former MLA Ananthvenkataramireddy reacted to TDP MLA Gummanuru Jayaram’s comments

ఫిర్యాదు చేసేందుకు వచ్చిన వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై గుంతకల్లు పోలీసుల దాడి చేశారని ఆగ్రహించారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో లాండ్ అండ్ ఆర్డర్ ఫెయిల్ అయ్యిందని ఫైర్‌ అయ్యారు. బాధితులపైనే హత్యాయత్నం కేసు కేసులు నమోదు చేస్తున్నారన్నారు. టీడీపీ ప్రజాప్రతినిధుల చెప్పు చేతుల్లో పోలీసులు పనిచేస్తున్నారని వివరించారు మాజీ ఎమ్మెల్యే అనంతవెంకటరామిరెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news