కరెంట్ బిల్లు అడిగితే బూతులు తిడుతూ దాడి.. కేసు నమోదు

-

కరెంట్ బిల్లు చెల్లించాలని అడిగినందుకు ఓ వినియోగదారుడు కరెంట్ సిబ్బందిపై దాడికి పాల్పడ్డాడు. ఇష్టానుసారంగా బూతులు తిట్టడమే కాకుండా భౌతికి దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన మల్కాజ్‌గిరి – మౌలాలి డివిజన్ పరిధిలోని ఆర్టీసీ కాలనీలో బుధవారం వెలుగుచూసింది.

స్థానికుల కథనం ప్రకారం.. కరెంట్ బిల్లు వసూలు చేసేందుకు వచ్చిన సురేష్ అనే లైన్‌మెన్‌పై ఇర్ఫాన్ అనే వినియోగదారుడు బూతులు తిడుతూ భౌతిక దాడికి పాల్పడ్డాడు. అంతేకాకుండా సురేష్ ద్విచక్ర వాహనాన్ని ఇర్ఫాన్ డ్యామేజ్ చేసినట్లు తెలిసింది. విషయం తెలుసుకున్న విద్యుత్ అధికారులు వెంటనే ఇర్ఫాన్‌పై ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మల్కాజ్‌గిరి పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news