ఏపీలో విషాదం… గుండెపోటుతో మాజీ ఎమ్మెల్యే మృతి చెందారు. ఆలూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే లోకనాథ్ హార్ట్ ఎటాక్‌తో మృతి చెందారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాత్రి ఆయన తుదిశ్వాస విడిచారు.

1989లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఆలూరు నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి రంగన్నపై విజయం సాధించారు. లోకనాథ్ స్వగ్రామం మొలగవల్లిలో అంత్యక్రియలు జరగనున్నాయి. ఆయన మరణం పట్ల పలువురు రాజకీయ నేతలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.