దేశ రాజధాని ఢిల్లీలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. నేషనల్ హెరాల్డ్ స్కామ్ కేసులో మరోసారి విచారణకు రావాలని ఈడీ కాంగ్రెస్ అగ్రనేతలైన సోనియాగాంధీ, రాహుల్ గాంధీలకు నోటీసులు ఇచ్చింది.
అంతకుముందు వీరిద్దరి పేర్లను ఛార్జిషీటులో చేర్చింది. దీనిని ఖండిస్తూ దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ జాతీయ నాయకత్వం పిలుపు నిచ్చింది. ఈ క్రమంలోనే ఏఐసీసీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ నేతల నిరసన తెలిపారు. కాంగ్రెస్ ఆఫీసు నుంచి ఈడీ కార్యాలయం వరకూ ర్యాలీ చేపట్టారు. దీంతో సోనియా గాంధీ నివాసం వద్ద భారీ భద్రతను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ నిరసనల నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భారీగా భద్రతా బలగాలను దేశరాజధానిలో మోహరించారు.