భారత్‌పై పాక్ మాజీ ప్రధాని ప్రశంసల వర్షం..!!

-

భారతదేశ ప్రభుత్వంపై పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రశంసల వర్షం కురింపించారు. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలపై పన్నులను తగ్గించిన నేపథ్యంలో పాక్ మాజీ ప్రధాని ట్విట్టర్ వేదికగా భారత్‌ను మెచ్చుకున్నారు. అగ్రరాజ్యమైన అమెరికా ఒత్తిళ్లను తట్టుకుని.. దేశ ప్రజలకు రిలీఫ్ ఇవ్వడానికి రష్యా దేశం నుంచి తక్కువ ధరకు చమురును కొనుగోలు చేసిందన్నారు. క్వాద్ దేశాల్లో భారత్ సభ్య దేశంగా కొనసాగుతోందన్నారు. అయినా అగ్రరాజ్యం నుంచి ఒత్తిడిని తట్టుకుని నిలబడటం ఎంతో సంతోషకరంగా ఉందన్నారు.

పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్

అలాగే భారత దేశానికంటూ స్వతంత్ర విదేశీ విధానం ఉందని, అందువల్లే ఈ నిర్ణయం సాధ్యమైందన్నారు. తాను అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యేక విదేశాంగ విధానం కోసం ప్రయత్నించానని, కానీ కొందరు అడ్డుకున్నారని ఆయన పేర్కొన్నారు. కాగా, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పెట్రోల్, డీజిల్ ధరలపై ఎక్సైజ్ పన్ను తగ్గిస్తున్నట్లు శనివారం ట్విట్ చేశారు. పెట్రోల్‌పై రూ.8, డీజిల్‌పై రూ.6, వంట గ్యాస్‌పై రూ.200 సబ్సిడీ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సబ్సిడీని వినియోగదారుల ఖాతాకు నేరుగా జమ అవుతుందన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version