యూకో బ్యాంక్ మాజీ సీఎండీ సుబోధ్ కుమార్ గోయల్ అరెస్ట్ అయ్యాడు. మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న గోయల్‌ను అరెస్ట్ చేసినట్టు తెలిపారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ).

గోయల్ యూకో బ్యాంక్ సీఎండీగా ఉన్నప్పుడు కోల్‌కతా కేంద్రంగా పని చేస్తున్న కాన్‌కాస్ట్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ (సీఎస్పీఎల్) కంపెనీకి భారీ మొత్తంలో రుణాలు మంజూరు చేసిన వ్యవహారంలో అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు వస్తున్నాయి.
మంజూరైన రుణాల్లో రూ.6,210.72 కోట్లను సీఎస్పీఎల్ కంపెనీ దుర్వినియోగం చేసినట్టు ఇప్పటికే సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు అయింది. ఈ తరుణంలోనే యూకో బ్యాంక్ మాజీ సీఎండీ సుబోధ్ కుమార్ గోయల్ అరెస్ట్ అయ్యాడు.