జూనియర్ ఎన్టీఆర్ వర్సెస్ టిడిపి ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఎపిసోడ్ పై తాజాగా వైసిపి మాజీ మంత్రి రోజా స్పందించారు. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలను ఏపీలో ఎవరు అడ్డుకోలేరని రోజా తేల్చి చెప్పేశారు. రాజకీయాలు అలాగే సినిమాలను కలపొద్దని వైసీపీ నేత రోజా వెల్లడించారు.

జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారని తెలిపారు. అరచేతులు సూర్యుడిని ఎలా ఆపలేరో ఆయన సినిమాలను కూడా ఎవరు ఆపలేరని స్పష్టం చేశారు. సినిమాలు బాగుంటే జనం చూస్తారు అన్నారు. ఎమ్మెల్యేలు టికెట్లు కొన్నా కూడా పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాలు ఎవరు చూడలేదని చురకలు అంటించారు. బాగాలేని సినిమాలను ఎవరు ఆడించలేరని గుర్తు చేశారు రోజా.