జింబాబ్వే మాజీ కెప్టెన్, అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లలో ఒకరైన హీత్ స్ట్రీక్ బాన్ మీద 8 సంవత్సరాలు నిషేధించారు. ఐసీసీ అవినీతి నిరోధక కోడ్‌ను ఐదుసార్లు నిబంధనలను ఉల్లంఘించినట్లు హీత్ స్ట్రీక్ ఒప్పుకున్నాడు, ఆ తర్వాత అతనిపై ఐసీసీ ఈ చర్య తీసుకుంది. ఐసీసీ అవినీతి నిరోధక నియమావళిలోని ఐదు నిబంధనలను తాను ఉల్లంఘించినట్లు హీత్ స్ట్రీక్ అంగీకరించాడు.
జింబాబ్వే యొక్క గొప్ప బౌలర్లలో ఒకరైన హీత్ స్ట్రీక్ 2017 మరియు 2018 మధ్య అనేక మ్యాచ్‌లలో ప్లేయర్స్ దగ్గరికి బుకీలను అనుమతించడాని, అనేక మ్యాచ్ లలో అవినీతి నిరోధక నియమావళిని ఉల్లంఘించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ మ్యాచ్‌ల్లో అంతర్జాతీయ క్రికెట్, ఐపీఎల్, బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్, ఆఫ్ఘనిస్తాన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లు కూడా ఉన్నాయి. అయితే ఈ మ్యాచ్‌ల ఫలితాలపై అవి ఎలాంటి ప్రభావం చూపలేదని ఐసీసీ అవినీతి నిరోధక శాఖ స్పష్టం చేసింది. హీత్ స్ట్రీక్ తనపై వచ్చిన ఆరోపణలపై ముందు బుకాయించాడు కానీ చివరికి అతను తన తప్పును అంగీకరించాడు. ఇప్పుడు హీత్ స్ట్రీక్ 8 సంవత్సరాలు ఏ క్రికెట్ కార్యకలాపాల్లోనూ పాల్గొనలేరు.