ఉద్యోగులకు శుభవార్త.. కరోనా కాలంలోనూ 10శాతం జీతాల పెంపు.. ఏయే రంగాల్లో అంటే..

-

దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి తీవ్రంగా ఉంది. రోజు రోజుకీ పెరుగుతున్న కేసులు కరోనా విలయతాండవం చేస్తుందని నిరూపిస్తున్నాయి. లాక్డౌన్ పెట్టే ఆలోచనే లేదని చెబుతున్న ప్రభుత్వాలు రాత్రిపూట కర్ఫ్యూ విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదేమైనా సంపూర్ణ లాక్డౌన్ మాత్రం లేదని అర్థం అవుతుంది. దీనివల్ల ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి ఉపశమనం లభించినట్టే. ఇదేగాక తాజాగా ఒకానొక సర్వే ప్రకారం ఉద్యోగులకి మరో తీపి కబురు అందనుంది.

జీనియస్ కన్సల్టెంట్ సంస్థ వారు చేసిన సర్వే ప్రకారం చాలా కంపెనీలు తమ ఉద్యోగులకి జీతాలు పెంచే మూడ్ లో ఉన్నాయని తేలింది. 5నుండి 10శాతం జీతాలు పెంచాలని భావిస్తున్నాయట. ఈ సర్వేలో 1200కంపెనీలను చేర్చారు. ఇందులో 59శాతానికి పైగా కంపెనీలు తమ ఉద్యోగులకి జీతాలు పెంచాలని చూస్తున్నారట. దాదాపుగా చాలా కంపెనీలు 10శాతం పెంచుతాయట. చాలా కొద్దిశాతం మాత్రమే 20శాతం జీతాలని పెంచేలా ఉన్నాయట. ఇంకా కొద్ది శాతం కంపెనీలు జీతాలు పెంచే ఆలోచనఏ చేయట్లేదట.

జీతాలు పెంచడమే కాకుండా 43శాతం కంపెనీలు కొత్తవాళ్ళకి ఉద్యోగాలను ఇవ్వనున్నాయట. తమ కంపెనీల్లో కొత్తవాళ్ళని నియమించుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నాయని సమాచారం. ఈ కంపెనీల్లో హెచ్ ఆర్, ఐటీ, బీపీఓ, బ్యాంకింగ్, ఫైనాన్స్, నిర్మాణం, ఇంజనీరింగ్, విద్య, లాజిస్టిక్స్, ఆతిథ్యం, ఫార్మా, మీడియా, మెడికల్, పవర్ ఎనర్జీ ఇంకా రియల్ ఎస్టేట్ సంస్థలు ఉన్నాయి.

ఆర్థిక కార్యకలాపాల్లో ఊహించిన దానికంటే వేగంగా విశ్వాసం పెరగడం, లాభాలు రావడం, మెరుగైన వృద్ధి కారణంగా ఈ సంవత్సరంలో చాలా కంపెనీలు జీతాలు పెంచాలని చూస్తున్నాయి. ఈ సంవత్సరంలో 20శాతం కంపెనీలు జీతాలు పెంచాలని చూస్తుండగా, అది 2020లో 12శాతం మాత్రమే ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version