BREAKING : హైదరాబాద్ ఈ-రేసింగ్ విజేత జీన్ ఎరిక్

-

హైదరాబాద్‌లో ఫార్ములా ఈ రేసింగ్ ముగిసింది. రేసింగ్ విజేతగా జీన్ ఎరిక్ నిలిచాడు. ఆ తర్వాత రెండో స్థానంలో నిక్ క్యాసిడీ (ఎనివిజన్ రేసింగ్), మూడో స్థానంలో సెబాస్టియన్ బ్యూమి(ఎన్విజన్ రేసింగ్) ఉన్నారు. గంటకు 322 కిలోమీటర్ల వేగంతో రేసర్లు దూసుకెళ్లారు. కాగా జీన్ ఎరిక్ ఇప్పటికే రెండుసార్లు ఫార్ములా-ఈ ఛాంపియన్ కావడం విశేషం. తాజా విజయంతో అతను మూడోసారి ఛాంపియన్‌గా అవతరించాడు. 2013లో ఫార్ములా-1 రేసు తర్వాత భారత్లో జరుగుతున్న ఫార్ములా-ఈ తొలి రేసుకు మన హైదరాబాద్ వేదికైంది.

దీనికి తోడు ఓవరాల్ గా ఇప్పటి వరకు ఫార్ములా-ఈ రేసుకు ఆతిథ్యమిచ్చిన 27వ నగరంగా హైదరాబాద్ చోటు దక్కించుకుంది. హుసేనాసాగర్ తీరప్రాంతంలో 2.8కిలోమీటర్ల నిడివితో ప్రత్యేకంగా నిర్మించిన సర్క్యూట్ పై మొత్తం 11 జట్లు, 22 మంది రేసర్లు తమ కార్లను పరుగులు పెట్టించారు. తొలిసారి ప్రవేశపెట్టిన అత్యాధునిక జెన్ 3 కార్లతో రేసర్లు దుమ్ములేపారు. రేసింగ్లో విదేశీ కంపెనీలు, రేసర్లదే హవా కాగా, భారత్ నుంచి మహీంద్ర రేసింగ్, టీసీఎస్ జాగ్వార్ బరిలోకి దిగడం గర్వంగా అనిపించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version