స్కూల్​వ్యాన్​ను ఢీకొట్టిన లారీ.. నలుగురు చిన్నారులు దుర్మరణం

-

మధ్యప్రదేశ్​లోని ఉజ్జయిని జిల్లాలోని నగ్దా – ఉన్హేల్ రహదారి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాంగ్​రూట్​లో వేగంగా వెళ్లిన ఓ లారీ స్కూల్​వ్యాన్​ను ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు చిన్నారులు అక్కడికక్కడే మరణించారు. గాయపడ్డ మరో పదకొండు మందిని చికిత్స కోసం ఉజ్జయినికి తరలించారు.

వివరాల్లోకి వెళితే.. ఉజ్జయిని జిల్లాలోని నగ్దా ప్రాంతంలోనున్న ఒక కాన్వెంట్​ వ్యాన్​ పిల్లలతో సహా స్కూల్​కు బయలుదేరింది. మార్గ మధ్యలో తప్పు మార్గంలో వస్తున్న ఒక లారీ​ వారికి ఎదురుగా వచ్చి వ్యాన్​ను ఢీకొట్టింది. స్కూల్ వ్యాన్​ నుజ్జు నుజ్జు అయ్యింది.

గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఆ సమయంలో అంబులెన్స్​ సేవలు సరిగా లేక విద్యార్థులను ఉజ్జయిని వైపు వెళ్తున్న బస్సులో చికిత్స కోసం తరలించారు. ఈ ఘటనలో నలుగురు చిన్నారులు మృతి చెందారు. మృతి చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version