అమిత్ షా – జూనియర్ ఎన్టీఆర్ భేటీపై బీజేపీ నేత విష్ణువర్దన్ రెడ్డి ఆసక్తికర కామెంట్లు చేశారు. అమిత్ షా-జూనియర్ ఎన్టీఆర్ భేటీ ఆహ్వానించదగ్గ పరిణామమని..యువత రాజకీయాల్లోకి రావాలని అమిత్ షా ఎప్పుడూ కోరుకుంటారని వెల్లడించారు. భవిష్యత్ రాజకీయ పరిణామాల్లో జరగబోయే మార్పులకు ఈ భేటీ నాందీ పలికిందని పేర్కొన్నారు. 2009 ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేశారు.. ఆయనకు రాజకీయ చైతన్యం ఉందన్నారు.
జూనియర్ అత్తమ్మ పురంధేశ్వరీ బీజేపీలోనే ఉన్నారు… అమిత్ షా-జూనియర్ ఎన్టీఆర్ భేటీతో తెలుగు రాష్ట్రాల్లో భవిష్యత్తులో కీలక మార్పులకు సంకేతంగా భావిస్తున్నామని పేర్కొన్నారు బీజేపీ నేత విష్ణువర్దన్ రెడ్డి.
ఏపీకి చెందిన కొందరు వైసీపీ నేతలు తమంతట తామే ముందుకొచ్చి ఢిల్లీ లిక్కర్ స్కాంతో సంబంధం లేదని చెప్పుకుంటున్నారని.. బీజేపీ అవినీతిపరులను దగ్గరకు రానీయదని హెచ్చరించారు. అవినీతి పరులు బీజేపీలో చేరి గంగలో మునిగి పునీతలవుదామని భావిస్తే.. అది కుదరని పని అని… ఏపీలో బీజేపీ బలపడకూడదని ఢిల్లీ పెద్దలతో సన్నిహితంగా ఉన్నామని వైసీపీ పెద్దలు చెప్పుకుంటున్నారన్నారు బీజేపీ నేత విష్ణువర్దన్ రెడ్డి.