Breaking : తూర్పు గోదావ‌రి లో దారుణం! రోడ్డు ప్ర‌మాదంలో న‌లుగురు మృతి

-

ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రం లో ని తూర్పు గోదావ‌రి జిల్లా లో దారుణం చోటు చేసుకుంది. తూర్పు గోదావ‌రి జిల్లా లో ని రంప చోడ‌వ‌రం మండ‌లం లో గ‌ల ఐ. పోల‌వ‌రం పాల కాలువ వ‌ద్ద ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదం లో న‌లుగురు మృతి చెందారు. ముగ్గురు అక్క‌డి కక్క‌డే చ‌నిపోయారు. ఒక‌రు ఆస్ప‌త్రి లో మృతి చెందాడు. అయితే ఈ ప్ర‌మాదం రెండు ద్వి చ‌క్ర వాహ‌నాల వ‌ల్ల జ‌రిగింద‌ని తెలుస్తుంది. ఇద్ద‌రు వ‌స్తున్న రెండు ద్వి చ‌క్ర వాహ‌నాలు ఢీ కొట్టాయి.

ఈ ప్రమాదంలో మృతి చెందిన వారు అంత కూడా ఒకే గ్రామానికి చెందిన వారుగా తెలుస్తుంది. మృతి చెందిన‌ న‌లుగురు కూడా తూర్పు గోదావ‌రి జిల్లాలోని జాగారం ప‌ల్లి కి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. వారు రామేశ్, శేఖ‌ర్, రాజ‌బాబు, పండుగా రంప‌చోడ‌వరం పోలీసులు గుర్తించారు. కాగ ఒకే గ్రామం లో నలుగురు చ‌నిపోవ‌డం తో జాగారం ప‌ల్లి లో విషాద ఛాయ‌లు అలుముకున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version