బ్రేకింగ్: భారత్ కు మరో నాలుగు రాఫెల్ యుద్ద విమానాలు

-

భారత్ చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం మరో నాలుగు రాఫెల్ యుద్ద విమానాలను ఫ్రాన్స్ నుంచి దిగుమతి చేసుకుంటుంది. వైమానిక దళ సామర్థ్యాలను పెంచడానికి భారత వైమానిక దళం మరో 3-4 రాఫెల్ యుద్ధ విమానాలను ప్రవేశపెట్టబోతోంది. రెండవ బ్యాచ్ రాఫేల్ ఫైటర్ జెట్‌ లు నవంబర్ మొదటి వారం నాటికి అంబాలాకు చేరుకోనున్నాయి.

జూలైలో వచ్చిన మొదటి ఐదు జెట్‌ లకు వీటిని జోడిస్తారు. “ఫ్రాన్స్ నుండి నవంబర్ మొదటి వారంలో మరో 3-4 రాఫెల్ యుద్ధ విమానాలు భారతదేశానికి చేరుకోనున్నాయి” అని ప్రభుత్వ ఉన్నత వర్గాలు జాతీయ మీడియాకు తెలిపాయి. రాఫెల్ ఫైటర్ జెట్‌ లు ఇప్పటికే తమ కార్యక్రమాలను మొదలు పెట్టాయి. ఇందుకోసం గానూ భారత పైలట్లు ఫ్రాన్స్‌లో శిక్షణ పొందుతున్నారు. మార్చి 2021 నాటికి భారత జట్టు శిక్షణ దశను పూర్తి చేసే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version