నాలుగేళ్ల పాప సోషల్ మీడియాను ఊపేస్తుంది…!

-

డైనోసార్లపై నాలుగేళ్ల అమ్మాయి పాడిన పాట ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతుంది. బ్రిటీష్ గాయని టామ్ రోసేన్తాల్ కుమార్తె ఫెన్ పాడిన పాట ఇప్పుడు సోషల్ మీడియాని ఊపేస్తుంది. డైనోసార్స్ ఇన్ లవ్ అనే లిరిక్స్ తో మొదలవుతున్న ఈ పాట విశేషంగా ఆకట్టుకుంది. ట్యూన్ విషయానికొస్తే, టామ్ ఆమెకు సహాయం చేయడంతో ఆ పాప ఈ పాటను విజయవంతంగా పాడింది.

ఫెన్ పాడిన ఒక నిమిషం పాటను టామ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేసారు. “నా 4 సంవత్సరాల కుమార్తె ఫెన్ ఈ రోజు తన మొట్టమొదటి సోలో పాటను రికార్డ్ చేసింది. ఆమె అన్ని పదాలతో మీ ముందుకు వచ్చింది మరియు నేను ఆమెకు పాటలో కొంత సహాయం చేసాను. దీనిని ‘డైనోసార్స్ ఇన్ లవ్’ అంటారు.” అంటూ పోస్ట్ చేసారు. వీడియోలో డైనోసార్స్ ఇన్ లవ్ అంటూ లిరిక్స్ తో పాట రన్ అవుతుంది.

ఈ క్రేజీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను విశేషంగా ఆకట్టుకుంది. ఈ వీడియోని ఇప్పటి వరకు 5 మిలియన్ల మంది వీక్షించగా దాదాపు 64,000 రీట్వీట్లు మరియు రెండు లక్షలకు పైగా లైక్‌లు ఉన్నాయి. ప్రస్తుతం ఈ వీడియోని పలువురు ప్రముఖులు కూడా మెచ్చుకుంటున్నారు. ఈ పాట మేకింగ్ గ్రామి అవార్డ్ కి నామిని అవుతుందని… మీ కుమార్తెకు ధన్యవాదాలు అంటూ పలువురు కామెంట్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version