ఉద్యోగాల పేరిట ఈరోజుల్లో ఎక్కువగా మోసాలు జరుగుతున్నాయి. విదేశాల నుంచి ఐటీ కంపెనీలో జాబ్ ఆఫర్లు వస్తున్నాయని అవి ఫేక్ అని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మోసాల్లో ఇండియన్స్ చిక్కుకుని మోసపోవద్దని సూచించింది. ఫేక్ ఐటీ జాబ్ ఆఫర్లతో జాగ్రత్తగా ఉండాలని భారతీయులకు కేంద్ర ప్రభుత్వం సూచనలు జారీ చేసింది. తప్పుడు సంస్థల పేరుతో థాయ్‌లాండ్, మయన్మార్‌లలో ఐటీ ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి కొందరు భారీగా మోసం చేస్తున్నారని హెచ్చరించింది.
విదేశాల్లో ఫేక్ ఐటీ జాబ్ ఆఫర్స్ వ్యవహారం గత కొంతకాలంగా ఇండియాలో గుట్టుగా సాగుతంది. ఉద్యోగానికి ఆశ పడి చాలా మంది ముందు వెనక చూసుకోకుండా.. లక్షల కొద్ది డబ్బులు ముట్టజెప్తున్నారు. అలా డబ్బులు కట్టిన వారిని మయన్మార్‌కు తీసుకెళ్లి కూలీల కింద వాడుకుంటున్న ఉదంతాలు ఒక్కొక్కటిగా బయటకొచ్చాయి. ఈ విధంగా మోసపోతున్నారు.
ఈ విషయంపై విదేశాంగశాఖ ప్రతినిధి ఆరిందమ్ బగ్చి సైతం స్పందించారు. థాయ్‌లాండ్, మయన్మార్‌లో ఉద్యోగాల విషయంలో జ్రాగత్తగా ఉండాలని భారత యువతకు సూచించారు. చాలా మంది థాయ్‌లాండ్, మయన్మార్‌కు వెళుతున్నారు. మయన్మార్‌లో ఇది చాలా ఎక్కువగా ఉంది. కూలీలుగా ఉన్న 30మందిని రక్షించినట్లు విదేశాంగ ప్రతినిధి పేర్కొన్నారు.
ఇంకో 80-90మంది అక్కడే ఉండొచ్చని అంచనా.. ఇక తాజాగా శనివారం కేంద్రం విడుదల చేసిన అడ్వైజరీ సైతం.. ఆయా జాబ్ రాకెట్లతో జాగ్రత్తగా ఉండాలని స్పష్టం చేసింది. ముఖ్యంగా ఐటీ రంగంలో నైపుణ్యం ఉన్న యువతను ఆకర్షించి, మోసం చేస్తున్నారట. సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులను చూసి మోసపోకూడదని, వాటిని నమ్మవద్దని స్పష్టంగా కేంద్రం చెప్తుంది.
ఉద్యోగాల కోసం టూరిస్ట్ వీసాల మీద వెళ్లాలని అనుకుంటున్న భారతీయులు ఆ విదేశీ యాజమాన్యంపై పక్కా సమాచారం తీసుకోవాలి. ఏజెంట్లకు సంబంధించిన పూర్తి వివరాలను కూడా సేకరించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. మయన్మార్‌లోని భారత రాయబార కార్యాలయం కూడా ఈ విషయంపై అడ్వైజరీని జారీ చేసింది. మయన్మార్‌లోని తూర్పు సరిహద్దు కేంద్రంగా డిజిటల్ స్కామింగ్కు పాల్పడుతున్నట్లు తెలిపింది. కాబట్టి..ఉద్యోగాల మోజులో పడి మోసం పోవద్దు..తెలియని పని చేసేప్పుడు ఒకటికి పది సార్లు ఆలోచించండి.
Attachments area