ఉచిత బస్సు ప్రయాణం కారణంగా రాష్ట్రంలో ఆటోలకు గిరాకీ తగ్గిపోయిందని, ఫలితంగా కుటుంబ పోషణ భారంగా మారిందని డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే పలువురు ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలకు పాల్పడిన కథనాలు వెలుగుచూశాయి.
తాజాగా గిరాకీ లేక ఆర్టీసీ బస్‌స్టాండ్ ఎదుటే గడ్డి మంది తాగి ఆటో డ్రైవర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.తూప్రాన్‌కు చెందిన ఆటో డ్రైవర్ గజ్జల బాబు(30) అద్దె ఇంట్లో ఉండి జీవనం కొనసాగిస్తున్నాడు.అతనికి భార్య,ఇద్దరు పిల్లలు ఉన్నారు.అయితే, రేవంత్ ప్రభుత్వం పెట్టిన ఫ్రీ బస్సు వల్ల గిరాకీ కావట్లేదని పిల్లలకు భోజనం కూడా సరిగ్గా పెట్టలేక పోతున్నని మనస్థాపానికి గురయ్యాడు.ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగానే ఆటోని ఆపి తాను నడిపే ఆటోలోనే గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని, చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం.